Indian aviation : చరిత్ర సృష్టించిన భారత విమానయాన సంస్థలు- ఒక్క రోజులో..-indian aviation makes history records 5 lakh passengers in a single day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Aviation : చరిత్ర సృష్టించిన భారత విమానయాన సంస్థలు- ఒక్క రోజులో..

Indian aviation : చరిత్ర సృష్టించిన భారత విమానయాన సంస్థలు- ఒక్క రోజులో..

Sharath Chitturi HT Telugu
Nov 18, 2024 12:13 PM IST

Indian aviation : ఒక్క రోజులో 5లక్షల మంది ప్రయాణికులు భారత విమానయాన సేవలు ఉపయోగించుకున్నారు. ఇదొక రికార్డు! ఈ నెంబర్లు ఏవియేషన్​ ఇండస్ట్రీకి ఊరటనిస్తాయి.

చరిత్ర సృష్టించిన భారత విమానయాన సంస్థలు..
చరిత్ర సృష్టించిన భారత విమానయాన సంస్థలు.. (Bloomberg)

భారత విమానయాన సంస్థలు చరిత్ర సృష్టించాయి! 2024 నవంబర్​ 17న, ఒక్క రోజులోనే 5లక్షలకుపైగా మంది దేశీయ ప్యాసింజర్లు విమానాల్లో ప్రయాణించారు. ఇంత భారీ మొత్తంలో ప్రయాణాలు జరగడం ఇదే తొలిసారి! అన్ని విమానయాన సంస్థలు కలిపి 3173 దేశీయ విమానాల్లో 5,05,412 మంది దేశీయ ప్రయాణీకులు జర్నీ చేశారు.

గత రెండు వారాలుగా విమాన రాకపోకలు నిలకడగా కొనసాగుతుండగా, నవంబర్ 08న 4.9 లక్షల మంది, నవంబర్ 09న 4.96 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఆ తర్వాత నవంబర్ 14, 15 తేదీల్లో 4.97 లక్షలు, 4.99 లక్షల మంది, నవంబర్ 16న 4.98 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారు. తాజాగా, నవంబర్​ 17న ఈ నెంబర్​ 5లక్షలు దాటింది.

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో క్యూ2-2025 ఫలితాలను ప్రకటించడం, వరుసగా ఏడు త్రైమాసికాల లాభాల తర్వాత నష్టాలను నమోదు చేయడం మధ్య ఈ స్థాయిలో ప్రయాణికల సంఖ్య నమోదు కావడం కాస్త ఊరటనిచ్చే విషయం. దీపావళి కన్నా, దీపావళి తర్వాత వస్తున్న పెళ్లిళ్ల సీజన్​కి ముందు ప్రయాణాలు పెరుగుతుండటం కొత్త ట్రెండ్​ని సూచిస్తోంది.

రద్దీ ఉన్నా, విమానాలు లేవు..!

ఈ నెలలో విమానాల మోహరింపు రోజుకు సగటున 3161 గా ఉంది. ఇది మునుపటి నెలతో పోలిస్తే రోజుకు 8 విమానాలు ఎక్కువ! కానీ దీపావళి నేపథ్యంలోని రద్దీ రోజుల్లో విమానయాన సంస్థలు మోహరించిన దానికంటే ఇది తక్కువ.

బోయింగ్ సమ్మె కారణంగా అకాశా ఎయిర్, ఎయిరిండియా ఎక్స్​ప్రెస్​ అధిక విమానాలను జోడించలేనప్పటికీ, స్పైస్​​జెట్ మాత్రం కొన్ని విమానాలను జోడించింది. అయితే, ఈ ఏడాది తొలి నెలల నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున 100 కంటే తక్కువ విమానాల రాకపోకలు సాగుతున్నాయి.

గత నెల లేదా అంతకంటే ఎక్కువ కాలంగా విమానయాన సంస్థలు ఫేక్ కాల్స్ వల్ల ప్రభావితమయ్యాయి, ఇందులో మళ్లింపులు, భద్రతా తనిఖీలు మరియు మరెన్నో ఉన్నాయి. దీంతో విమానయాన సంస్థలు ప్రయాణీకుల నిర్వహణకు, చిక్కుకుపోయిన ప్రయాణికులు, సిబ్బంది, విమానాలను బయటకు తీసుకురావడానికి బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతిమంగా లాభదాయకంగా ఉండాలంటే ఇలాంటి ఖర్చులన్నింటినీ వినియోగదారులకు బదలాయించాల్సి ఉంటుంది!

ఇటీవలి సంవత్సరాల్లో విమాన ప్రయాణాల పెరుగుదల ముఖ్యంగా గణనీయంగా ఉంది. విమానాశ్రయాల ఆధునీకరణ, విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రయాణికుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. వచ్చే ఏడాది దిల్లీ, ముంబైలో రెండు కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి రానుండటంతో ప్రస్తుత ఎయిర్ పోర్టుల కెపాసిటీ సమస్యకు ఊరట లభించనుంది.

కోవిడ్-19 మహమ్మారితో సహా గతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత విమానయాన రంగం స్థితిస్థాపకతకు ఈ మైలురాయి నిదర్శనం. దీని నుంచి ఐఏటీఏ అంచనా కంటే వేగంగా కోలుకుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే పరిశ్రమ సామర్థ్యం దాని ఎదుగుదలకు దోహదపడింది.

దేశం అభివృద్ధి చెందుతూ, ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ విమాన ప్రయాణానికి డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశం మొత్తం అభివృద్ధికి దోహదపడటానికి విమానయాన రంగానికి ఇది గణనీయమైన అవకాశాన్ని అందిస్తుంది. సాంప్రదాయకంగా విమానయాన వృద్ధి జీడీపీ వృద్ధి కంటే రెట్టింపు. భారత జీడీపీ 6% నుంచి 7.5% శ్రేణిలో వృద్ధి చెందుతోంది, కానీ విమానయాన వృద్ధి 5% వద్ద స్థిరంగా ఉంది! దీనికి ప్రధాన కారణం సామర్థ్యం లేకపోవడం. ఈ కొత్త మైలురాయి 2025కి మార్గాన్ని నిర్దేశించగలదు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్