Army chopper crashes: కుప్పకూలిన ఆర్మీ చాపర్ ‘చీతా’-indian army chopper crashes in arunachal pradesh pilots missing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Indian Army Chopper Crashes In Arunachal Pradesh, Pilots Missing

Army chopper crashes: కుప్పకూలిన ఆర్మీ చాపర్ ‘చీతా’

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 04:05 PM IST

Army chopper crashes: భారతీయ సైన్యానికి చెందిన హెలీకాప్టర్ చీతా గురువారం అరుణాచల్ ప్రదేశ్ లో కుప్పకూలింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Army chopper crashes: భారతీయ సైన్యానికి (Indian Army) చెందిన హెలీకాప్టర్ చీతా (cheetah) గురువారం అరుణాచల్ ప్రదేశ్ లో కుప్పకూలింది. ఆ చాపర్ లోని ఇద్దరు పైలట్ ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

ట్రెండింగ్ వార్తలు

Army chopper crashes: ప్రతికూల వాతావరణ పరిస్థితులు..

భారతీయ సైన్యానికి (Indian Army) చెందిన హెలీకాప్టర్ చీతా గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ లోని మాండల పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆ హెలీకాప్టర్ (Indian Army chopper) లోని ఇద్దరు పైలట్ల ఆచూకీ తెలియ రాలేదు. భారతీయ సైన్యానికి చెందిన ఎస్ఎస్బీ (SSB) దళం, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు గాలింపు ప్రారంభించారు. హెలీకాప్టర్ల ద్వారా కూలిన చాపర్ (cheetah), అందులోని పైలట్ల కోసం గాలింపు చేపట్టారు. చాపర్ కూలిన ప్రాంతమంతా దట్టమైన పొగమంచు ఆవరించి ఉందని, 5 మీటర్ల దూరంలోని వస్తువులు కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు ఉందని అధికారులు తెలిపారు.

Army chopper crashes: పర్వత ప్రాంతంలో..

సాధారణ విధుల్లో భాగంగా వెళ్లిన ఆర్మీ (Indian Army) ఏవియేషన్ హెలీకాప్టర్ చీతా (cheetah) అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్డిలా సమీపంలో కుప్పకూలిందని, ఉదయం 9.15 గంటల సమయంలో ఆ చాపర్ తో ఏటీసీ (ATC) కి సంబంధాలు తెగిపోయాయని ఆర్మీ గువాహటి డివిజన్ పీఆర్ఓ లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర రావత్ తెలిపారు. మాండల పర్వత ప్రాంతంలో ఇది కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్