Indian Army Agniveer results : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పరీక్ష ఫలితాలు విడుదల..
Indian Army Agniveer results 2023 : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Indian Army Agniveer results 2023 : 2023 ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు.. తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ అయిన joinindianarmy.nic.in లో చెక్ చేసుకోవచ్చు.

రెండు దశల్లో..
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.. ఏప్రిల్ 17న జరిగింది. ఏప్రిల్ 26న ముగిసింది. సెలక్షన్ ప్రక్రియలో రెండు దశలు ఉన్నాయి. మొదటిది.. ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఇక రెండోది.. రిక్రూట్మెంట్ ర్యాలీ. వీటిని ర్యాలీ వెన్యూల్లో ఏఆర్ఓలు నిర్వహిస్తారు.
అగ్నివీర్ పరీక్ష ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
Agniveer army result 2023 : స్టెప్ 1:- ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- హోం పేజ్ మీద 'అగ్నివీర్ రిజల్ట్ లింక్' అని ఉంటుంది. అది క్లిక్ చేయండి.
స్టెప్ 3:- మీ లాగిన్ వివరాలు ఇవ్వండి. సబ్మీట్ బటన్ ప్రెస్ చేయండి.
Agniveer results 2023 : స్టెప్ 4:- మీ స్కోర్ కార్డు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
స్టెప్ 5:- పరీక్షల ఫలితాలను డౌన్లోడ్ చేసుకండి.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2023 పరీక్ష ఫలితాల డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ టయర్ 1 ఫలితాల..
SSC CHSL 2022 tier 1 results : కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 ఫలితాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు ssc.nic.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.
ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ 2022 టయర్ 1 ను ఎస్ఎస్సీ మార్చి 9 నుంచి మార్చి 21 వరకు నిర్వహించింది. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఈ పరీక్షలో ఉత్తీర్ణులై షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు టయర్ 2పరీక్షకు హాజరవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం