Trade deficit in August: భారత వాణిజ్య లోటు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రెట్టింపై 27.98 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి.
ఎగుమతులు స్వల్పంగా 1.62 శాతం పెరిగి 33.92 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా తెలిపింది. ఆగస్టు 2021లో వాణిజ్య లోటు 11.71 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ ఏడాది ఆగస్టులో దిగుమతులు 37.28 శాతం పెరిగి 61.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఏప్రిల్-ఆగస్టు (2022-23) మధ్య కాలంలో ఎగుమతులు 17.68 శాతం వృద్ధితో 193.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలో దిగుమతులు 45.74 శాతం పెరిగి 318 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టులో వాణిజ్య లోటు 124.52 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్య లోటు 53.78 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇది కూడా చదవండి: 26.18 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్య లోటు