International Flights | మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పున:ప్రారంభం-india to resume regular international flight operations from march 27 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India To Resume Regular International Flight Operations From March 27

International Flights | మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పున:ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Mar 08, 2022 07:47 PM IST

కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. మార్చి 26, 2022 రాత్రి 11:59 తర్వాత సర్వీసులు పున: ప్రారంభమవుతాయని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.

In a statement, the Directorate General of Civil Aviation (DGCA) said that the move comes in view of increased vaccination coverage against Covid-19 across the world. (Representative)
In a statement, the Directorate General of Civil Aviation (DGCA) said that the move comes in view of increased vaccination coverage against Covid-19 across the world. (Representative) (MINT_PRINT)

New Delhi | మార్చి 27, 2022 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను పున: ప్రారంభించాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గినందున భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. అలాగే ఆంక్షలు లేని ప్రయాణం కోసం ‘ఎయిర్ బబుల్’ ఏర్పాట్లు కూడా రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చర్యతో విమానయాన రంగం మళ్లీ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ట్రెండింగ్ వార్తలు

దేశంలో కోవిడ్-19 కేసుల తగ్గుదల, అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెరిగినందున విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరిపి ఇండియా నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మార్చి 26, 2022 అర్ధరాత్రి 11:59 వరకు ప్రస్తుతం అమలులో ఉన్న సస్పెన్షన్ యధావిధిగా కొనసాగుతుందని DGCA స్పష్టం చేసింది.

Here's the update:

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలను విమానయానశాఖ నిలిపివేసింది. అయితే గత డిసెంబర్ 15 నుంచి పున: ప్రారంభించాలని నిర్ణయించినా, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల అనుసారం అంతర్జాతీయ రాకపోకలపై కఠిన కొవిడ్ ఆంక్షలు విధించింది.

ఎట్టకేలకు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈనెల 27 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కమర్షియల్ ఫ్లైట్స్ నడపాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.

WhatsApp channel

సంబంధిత కథనం