Pulitzer Prize winner complains: ‘పులిట్జర్ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్లనివ్వలేదు’-india stops journalist from flying to receive pulitzer prize ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Stops Journalist From Flying To Receive Pulitzer Prize

Pulitzer Prize winner complains: ‘పులిట్జర్ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్లనివ్వలేదు’

HT Telugu Desk HT Telugu
Oct 19, 2022 10:08 PM IST

Pulitzer Prize winner complains: కశ్మీర్ కు చెందిన ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డ్ గ్రహీత సానా ఇర్షాద్ మాటూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనను పులిట్జర్ పురస్కారం తీసుకోవడానికి అమెరికా వెళ్లనివ్వలేదని ఆరోపించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్ వార్తాసంస్థకు వచ్చింది. కోవిడ్ 19 సంక్షోభం సమయంలో ఆ వార్తాసంస్థ కవరేజ్ కి గానూ 2022 సంవత్సరం పులిట్జర్ అవార్డ్ లభించింది.

ట్రెండింగ్ వార్తలు

Pulitzer Prize winner complains: న్యూయార్క్ లో..

కశ్మీర్ కు చెందిన ఫొటో జర్నలిస్ట్ సానా ఇర్షాద్ మాటూ రాయిటర్స్ సంస్థ కోసం పని చేస్తున్నారు. పులిట్జర్ అవార్డుల ప్రదానం కార్యక్రమానికి వెళ్లడానికి ఆమె సిద్ధమయ్యారు. అయితే, తనను ఆ కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుందని బుధవారం ఆమె ఆరోపించారు. తన వద్ద సరైన వీసా, టికెట్ ఉన్నాయని, అయినా ఢిల్లీ ఏర్ పోర్ట్ లో తనను అడ్డుకుని, ఎలాంటి కారణం చెప్పకుండా, తన టికెట్ ను రద్దు చేశారని ఆమె ఆరోపించారు.

Pulitzer Prize winner complains: మరో ఇద్దరిని పంపించారు..

తనతో పాటు తన కలీగ్స్ మరో ఇద్దరు కూడా అదే కార్యక్రమానికి వెళ్తున్నారని, వారిని మాత్రం అడ్డుకోకుండా పంపించేశారని ఆమె వివరించారు. తనను మాత్రం ఏ కారణం చెప్పకుండా ఆపేశారని వాపోయారు. ’కారణం చెప్పాలి కదా? నేను చేసే పని వల్లనా? లేక వేరే కారణమేదైనా ఉందా? చెప్పాలి కదా’ అని ఆమె ప్రశ్నించారు.

Pulitzer Prize winner complains: ఇది రెండో సారి..

గతంలో కూడా ఒకసారి ఫొటో జర్నలిస్ట్ సానా ఇర్షాద్ మాటూ ని ఇలాగే ఆపేశారు. జులై నెలలో ఒక పుస్తకావిష్కరణ, ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ కు హాజరవడానికి పారిస్ వెళ్లడానికి ఆమె సిద్ధమయ్యారు. అయితే, ఆమెను అప్పుడు కూడా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. 2018 నుంచి ఆమె ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్ గా కశ్మీర్లో పని చేస్తున్నారు.

IPL_Entry_Point