Covid 4th wave india : కోవిడ్ కేసులు మళ్లీ జంప్.. ఒక్కరోజులో 7,240-india sees fourth wave signs as surge in covid cases reports 7 240 infections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Sees Fourth Wave Signs As Surge In Covid Cases Reports 7,240 Infections

Covid 4th wave india : కోవిడ్ కేసులు మళ్లీ జంప్.. ఒక్కరోజులో 7,240

HT Telugu Desk HT Telugu
Jun 09, 2022 12:38 PM IST

కోవిడ్ 4వ వేవ్ వస్తోందా? అంటే తాజాగా నమోదవుతున్న కేసులు అవే సంకేతాలను ఇస్తున్నాయి.

బస్సు స్టేషన్‌లో కోవిడ్ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం
బస్సు స్టేషన్‌లో కోవిడ్ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం (PTI)

న్యూఢిల్లీ, జూన్ 9: ఇండియాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,240 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంబంధిత వివరాలు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

బుధవారం ఇండియాలో అంతకుముందు రోజుతో పోల్చితే 41 శాతం కేసులు పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 5,233 కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర కోవిడ్ కేసుల పెరుగుదలతో ఈ పెరుగుదల మొదలైందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 2,701 కేసులు నమోదైనట్టు నిన్న ఆ రాష్ట్రం నివేదించింది.

తాజా కేసులతో దేశంలో మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 32,498కు చేరుకుంది.  దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో  ఈ సంఖ్య 0.8 శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో రోజువారీ పాజిటివిటీ రేట్ 1.31 శాతంగా ఉంది. అయితే వారం రోజుల పాజిటివిటీ రేటు 2.13గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో 3,591 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటివరకు కోలుకున్న సంఖ్య 4,26,40,301గా ఉందని, మొత్తం రికవరీ రేటు 98.71 శాతమని తెలిపారు.

దేశంలో గడిచిన 24 గంటల్లో 3,40,615 కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 85.38 కోట్ల టెస్టులు జరిపినట్టు ఐసీఎంఆర్ డేటా వెల్లడించింది.

దేశంలో ఇప్పటివరకు 194.59 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారని, 2,48,87,047 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైందని కేంద్రం తెలిపింది. కాగా ఇప్పటివరకు 3.77 కోట్ల బూస్టర్ డోసులు వేసినట్టు కేంద్రం తెలిపింది.

12 నుంచి 14 సంవత్సరాల వయస్సు పిల్లలకు మార్చి 16 నుంచి వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. 3.47 కోట్ల మంది ఈ వయస్సులో ఉన్న కౌమార పిల్లలకు వాక్సిన్ వేసినట్టు తెలిపింది.

నాలుగు రాష్ట్రాలకు అలెర్ట్..

కాగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నాలుగు రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తగినన్ని టెస్టులు చేసి పాజిటివ్ కేసులు గుర్తించాలని, ప్రజలు కోవిడ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్