India Retail inflation : దేశంలో ఆగస్టు నెలకు సంబంధించిన రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటాను కేంద్రం సోమవారం ప్రకటించింది. మూడు నెలల పాటు దిగొచ్చిన ద్రవ్యోల్బణం.. ఆగస్టు నెలలో ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆగస్టు నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 7శాతానికి చేరింది. తాజా పరిణామాలతో.. వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ మరింత తీవ్రంగా వ్యవహరించే అవకాశం ఉంది!,దేశంలో గత కొన్ని వారాలుగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. కానీ ఆగస్టు నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్న విషయం.,గోధుమ, వరి, పప్పులు వంటి ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సీపీఐ(కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్)లో అధిక భాగం ఆహార ద్రవ్యోల్బణానిదే.,డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో ఆహార ద్రవ్యోల్బణం.. 7.62శాతంగా నమోదైంది. జులైలో అది 6.69శాతంగా ఉండేది. ఇక 2021 ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం 3.11శాతంగా ఉండటం గమనార్హం.,Retail Inflation data : దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంట చేతికి రావడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో.. అధిక వర్షాల కారణంగా పంట నాశనమైపోతోంది. వీటి ప్రభావంతో రానున్న నెలల్లో ఆహార ధరల మరింత పెరిగే అవకాశం లేకపోలేదు!,2023 తొలినాళ్ల నాటికి రీటైల ద్రవ్యోల్బణాన్ని 6శాతానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది ఆర్బీఐ. అందుకు తగ్గట్టుగానే అంచనాలు కూడా వేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం 5శాతానికి చేరుతుందని అభిప్రాయపడింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆగస్టులో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏకంగా 7శాతానికి చేరింది.,RBI rate hike : తాజా పరిణామాలతో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టులో వడ్డీ రేట్లను 50బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ఈ నెల 30న పాలసీ మీటింగ్లో వడ్డీ రేట్ల పెంపు ఏ విధంగా ఉంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.,