New covid cases in India: భారత్ లో కొత్త కొరోనా కేసుల వివరాలు ఇవే..-india reports 171 new covid 19 cases in a day says central health ministry ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Reports 171 New Covid 19 Cases In A Day, Says Central Health Ministry

New covid cases in India: భారత్ లో కొత్త కొరోనా కేసుల వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 04:16 PM IST

New covid cases in India: గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 171 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో అత్యధికం కేరళలో నమోదైనట్లు తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

New covid cases in India: గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 171 కోవిడ్ 19 (covid 19) కేసులు నమోదయ్యాయని బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో అత్యధికం కేరళలో నమోదైనట్లు తెలిపింది. బుధవారం నాటికి దేశంలో ఉన్న corona యాక్టివ్ (covid 19) కేసుల సంఖ్య 2342 అని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Highest in Kerala: కేరళలో 1342

దేశవ్యాప్తంగా ఉన్న కొరోనా (corona) యాక్టివ్ కేసుల సంఖ్యలో అత్యధికంగా కేరళలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కొరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1342 కాగా, మహారాష్ట్రలో 146, ఒడిశాలో 82, రాజస్తాన్ లో 62, తమిళనాడులో 52, ఉత్తర ప్రదేశ్ లో 21, పశ్చిమ బెంగాల్ లో 54 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,80,926 కరోనా (corona) టెస్ట్ లు జరపగా, 171 మందికి కొరోనా (corona) పాజిటివ్ గా తేలింది. ఇప్పటివరకు భారత్ లో మొత్తంగా 4.47 కోట్ల మంది కరోనా (corona) బారిన పడగా, 5,30,722 మంది కొరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

220 crore vaccines: 220 కోట్ల టీకాలు

అలాగే, ఇప్పటివరకు భారత్ లో 220.15 కోట్ల డోసుల టీకాలను తీసుకున్నారు. గత 24 గంటల్లో మొత్తం 44,397 టీకా డోసులను ఇచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ బీఎఫ్ 7 (Omicron BF.7) వేరియంట్ కారణంగా చైనా సహా పలు ప్రపంచ దేశాల్లో కోవిడ్ 19 (covid 19) కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఒకవేళ కొరోనా (corona) కేసుల సంఖ్య భారీగా పెరిగితే.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. ఆసుపత్రుల్లో బెడ్స్ ను, మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది. టెస్ట్ ల సంఖ్యను పెంచాలని, పాజిటివ్ గా తేలిన వారి స్యాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని కోరింది. కొత్త (covid 19) వేరియంట్లను గుర్తిస్తే, వెంటనే సమాచారమివ్వాలని సూచించింది. అంతేకాకుండా, కొరోనా కేసుల సంఖ్య భారీగా ఉన్న చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి భారత్ వచ్చిన వారికి విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్ట్ చేయాలని స్పష్టం చేసింది.

IPL_Entry_Point

టాపిక్