India Post Recruitment 2023: పోస్టల్ విభాగంలో 1899 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; స్పోర్ట్స్ కోటాలో మాత్రమే..
India Post Recruitment 2023: పోస్టల్ విభాగంలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిల్స్ లో, వివిధ కేటగిరీల్లో మొత్తం 1899 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఈ నియామకాలు జరుపుతున్నారు.
India Post Recruitment 2023: ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1899 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. వాటిలో ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్ట్ లను స్పోర్ట్స్ కోటాలో మాత్రమే భర్తీ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ “https://dopsportsrecruitment.in” లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.
లాస్ట్ డేట్
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 9. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో నవంబర్ 10వ తేదీ నుంచి “https://dopsportsrecruitment.in” వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ ల వారీగా వేతన శ్రేణి ఇలా ఉంది.
పోస్టల్ అసిస్టెంట్ లెవెల్ 4 - రూ. 25,500 - రూ.81,100
సార్టింగ్ అసిస్టెంట్ లెవల్ 4 - రూ. 25,500 - రూ.81,100
పోస్ట్‌మ్యాన్ లెవెల్ 3 - రూ. 21,700 - రూ.69,100
మెయిల్ గార్డ్ లెవెల్ 3 -రూ. 21,700 - రూ.69,100
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవల్ 1 - రూ. 18,000 - రూ.56,900
అర్హత, ఇతర వివరాలు..
పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్ కు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పై పనిచేయగలగాలి. పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ పోస్ట్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్కిల్ లోని స్థానిక భాషపై పట్టు ఉండాలి. 10వ తరగతిలో ఆ సబ్జెక్టు చదివి ఉండాలి. పోస్ట్ మాన్ పోస్ట్ కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఎంటీఎస్ పోస్ట్ కు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్
- నోటిఫికేషన్‌లోని 7వ పేరాలో పేర్కొన్న ఏదైనా క్రీడలు / గేమ్‌లలో జాతీయ లేదా అంతర్జాతీయ పోటీలో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
- నోటిఫికేషన్‌లోని పేరా 7లో పేర్కొన్న ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లలో తమ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
- నోటిఫికేషన్‌లోని 7వ పేరాలో పేర్కొన్న ఏదైనా క్రీడలు/గేమ్‌లలో ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పాఠశాలల కోసం జాతీయ క్రీడలు/గేమ్స్‌లో రాష్ట్ర పాఠశాల జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు.
- నేషనల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ డ్రైవ్ కింద ఫిజికల్ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు.
వయో పరిమితి
పోస్టల్ అసిస్టెంట్ - 18-27 సంవత్సరాలు
సార్టింగ్ అసిస్టెంట్ - 18-27 సంవత్సరాలు
పోస్ట్‌మాన్ - 18-27 సంవత్సరాలు
మెయిల్ గార్డ్ - 18-27 సంవత్సరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 18-25 సంవత్సరాలు