Nuclear weapons : పాకిస్థాన్ కన్నా భారత్ దగ్గరే అణ్వాయుధాలు ఎక్కువ.. కానీ!
పాకిస్థాన్‌తో పోల్చుకుంటే.. భారత్ వద్దే అణ్వాయుధాలు అధికంగా ఉన్నట్టు ఓ నివేదిక తెలిపింది. అయితే.. చైనా అణ్వాయుధాల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక గుర్తించింది.
India nuclear weapons : పాకిస్థాన్ కంటే భారత్ వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని, చైనా తన అణ్వాయుధాలను 2023 జనవరిలో 410 వార్ హెడ్ల నుంచి 2024 జనవరి నాటికి 500కు విస్తరించిందని స్వీడన్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) సోమవారం ఒక నివేదికలో తెలిపింది.
2023 జనవరిలో 410 వార్ హెడ్లుగా ఉన్న చైనా అణ్వాయుధాలు 2024 జనవరి నాటికి 500కు పెరిగాయని, రానున్న కాలంలో ఇది మరింత పెరుగుతుందని సిప్రీ తన విశ్లేషణలో పేర్కొంది.
అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు.. తమ అణ్వాయుధాలను ఆధునీకరించడం కొనసాగించాయి. వాటిలో చాలా దేశాలు.. 2023లో కొత్త అణ్వాయుధ ఆయుధాల వ్యవస్థలను మోహరించాయి.
సిప్రీ డేటాలోని ఇతర వివరాలు..
- ఈ ఏడాది జనవరిలో భారతదేశం నిల్వ చేసిన అణ్వాయుధాలు 172. పాకిస్థాన్‌లో ఈ సంఖ్య 170.
- 2023లో భారత్ తన అణ్వాయుధాలను కొద్దిగా విస్తరించగా, 2023లో భారత్, పాకిస్థాన్లు కొత్త తరహా న్యూక్లియర్ డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఉన్నాయి.
- SIPRI report on nuclear weapons : భారత అణ్వస్త్ర ప్రోగ్రామ్‌లో పాకిస్థానే టార్గెట్‌గా ఉంటోంది. కానీ.. ఇటీవలి కాలంలో ఇండియా అణ్వాయుధా టార్గెట్స్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. చైనాను కూడా చేరుకోగలిగే విధంగా.. లాంగ్ రేంజ్ వెపన్స్‌ని రెడీ చేస్తోంది ఇండియా.
- ప్రపంచవ్యాప్తంగా మోహరించిన వార్హెడ్లలో దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులను హై ఆపరేషనల్ అలర్ట్‌లో ఉన్నాయి. వాటిలో దాదాపు అన్నీ రష్యా లేదా అమెరికాకు చెందినవే. అయితే, తొలిసారిగా చైనా వద్ద కొన్ని వార్ హెడ్లు హై ఆపరేషనల్ అలర్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
- మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు 90 శాతం రష్యా, అమెరికాల వద్దే ఉన్నాయి.
- 2023 జనవరితో పోలిస్తే రష్యా 36 అదనపు వార్ హెడ్లను మోహరించినట్లు నిఘా సంస్థ తెలిపింది.
- రష్యా లేదా అమెరికా నిల్వల కంటే చైనా వద్ద అణ్వాయుధాల నిల్వలు చాలా తక్కువగా ఉంటాయని నివేదిక తెలిపింది.
China Nuclear weapons : ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అనిశ్చితులు పెరుగుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం వంటివి ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఉత్తర కొరియా.. నిత్యం క్షిపణీ పరీక్షలతో ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఘర్షణలు, యుద్ధం మాట వచ్చినా.. అణ్వాయుధాల వినియోగం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి. దేశాలన్నీ.. అణ్వాయుధాలను అడ్డంపెట్టుకుని బెదిరిస్తూ ఉంటాయి. ఇవి సర్వత్రా భయాందోళనలను సృష్టిస్తూ ఉంటాయి.
సంబంధిత కథనం