China map: మళ్లీ చైనా లొల్లి.. అరుణాచల్ మాదేనంటూ మ్యాప్ రూపొందించిన పొరుగుదేశం
China map: చైనా మళ్లీ మరో వివాదానికి తెర లేపింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ తమ భూ భాగమేనని పేర్కొంటూ కొత్త మ్యాప్ ను రూపొందించింది. ఈ మ్యాప్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
China map: చైనా మళ్లీ మరో వివాదానికి తెర లేపింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ తమ భూ భాగమేనని పేర్కొంటూ కొత్త మ్యాప్ ను రూపొందించింది. ఈ మ్యాప్ పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
2023 ఎడిషన్
2023 స్టాండర్డ్ ఎడిషన్ పేరుతో చైనా కొత్త మ్యాప్ ను రూపొందించింది. ఆ మ్యాప్ లో మళ్లీ తప్పుడు సరిహద్దులతో వివాదానికి తెర లేపింది. భారత్ కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్ లతో పాటు సౌత్ చైనా సీ, తైవాన్ కూడా చైనా తమ సొంత భూభాగమేనని పేర్కొంటూ ఆ మ్యాప్ ను రూపొందించింది. తైవాన్, సౌత్ చైనా సీ కూడా తమదేనంటూ చైనా మ్యాప్ ను రూపొందించడంపై అంతర్జాతీయంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ అభ్యంతరం
చైనా తీరుపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దౌత్య మార్గాల ద్వారా చైనాకు అభ్యంతరాన్ని తెలియజేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా వ్యవహార తీరు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమవుతాయని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని, ఈ విషయంలో ఎలాంటి చర్చోపచర్చలకు తావు లేదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మరో 10 రోజుల్లో ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ 20 సదస్సు జరగనుంది. ఆ సదస్సును జీ 20 అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహిస్తోంది. ఆ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో చైనా భారత్ ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండడం గమనార్హం.