Akshay Kumar: ఫ్లాప్ లతో అలా.. అందుకే కెనడా పాస్ పోర్ట్-india is everything to me akshay kumar on decision to renounce canadian passport ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Is Everything To Me: Akshay Kumar On Decision To Renounce Canadian Passport

Akshay Kumar: ఫ్లాప్ లతో అలా.. అందుకే కెనడా పాస్ పోర్ట్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 06:49 PM IST

Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కు భారత పౌరసత్వంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. దీనిపై విమర్శలు వస్తుండడంతో కెనడా పౌరసత్వాన్ని వదులుకోవాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నారు.

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ తన కెనడా పౌరసత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. భారతదేశ పౌరసత్వంతో పాటు కెనడా పౌరసత్వం కలిగి ఉండడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Akshay Kumar renounce Canadian passport: అనవసర విమర్శలు..

కెనడా పౌరసత్వం తీసుకోవడం వెనుక బలమైన కారణముందని, ఆ తరువాత పరిస్థితుల్లో మార్పు రావడంతో ఇండియాలోనే ఉండిపోయానని వివరించారు. హిందీ న్యూస్ చానెల్ ‘ఆజ్ తక్’లో ప్రసారమవుతున్న ‘సీదీ బాత్ (Seedhi Baat)’ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. అసలు కారణం తెలియకుండా, కెనడా పాస్ పోర్ట్ విషయంలో తనపై తెలియకుండా విమర్శలు చేశారన్నారు. భారతదేశమే తనకు సర్వస్వమని, ఈ దేశం తనకు అన్నీ ఇచ్చిందని స్పష్టం చేశారు.

Akshay Kumar ఫ్లాప్ లు వచ్చాయి..

కెనడా పౌరసత్వం తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఆజ్ తక్ ఇంటర్వ్యూలో అక్షయ్ వివరించారు. 1990లలో తనకు వరుసగా 15 ఫ్లాప్ లు వచ్చాయని, ఇక సినీ ఇండస్ట్రీలో తాను కొనసాగడం సాధ్యం కాదని భావించానని అక్షయ్ వివరించారు. ‘‘వరుసగా 15 ఫ్లాప్స్ అంటే ఇండస్ట్రీ నుంచి ఔట్ అంతే. అందుకే, ఇక వేరే పనేదైనా చూసుకోవాలనుకున్నాను. అదే సమయంలో కెనడాలో ఉండే నా మిత్రుడు కెనడాలో సెటిల్ కావచ్చని సలహా ఇచ్చాడు. ముందుగా, కెనడా పాస్ పోర్ట్ కు అప్లై చేసుకొమ్మని సూచించాడు. దాంతో, కెనడా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను. అదృష్టవశాత్తూ, ఆ పాస్ పోర్ట్ లభించింది’’ అని అక్షయ్ కుమార్ వివరించారు.

Akshay Kumar మళ్లీ హిట్స్..

కెనడా వెళ్ళిన సమయంలో, తన రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని అక్షయ్ తెలిపారు. అవి రిలీజ అయ్యి, సూపర్ హిట్ అయ్యాయని, దాంతో మళ్లీ తనకు ఆఫర్లు రావడం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. అప్పుడు, మళ్లీ ఇండియా వచ్చి, సినిమాల్లో వర్క్ చేయడం ప్రారంభించానన్నారు. ఆ తరువాత వరుస హిట్స్ తో బిజి అయ్యాయని, కెనడా పాస్ పోర్ట్ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయానని తెలిపారు. ఇప్పుడు విమర్శలు వస్తుండడంతో కెనడా పౌరసత్వాన్ని వదులుకోవలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అక్షయ్ కుమార్ నమస్తే లండన్, హేరాఫేరీ, ప్యాడ్ మ్యాన్ తదితర హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

టాపిక్