Independence Day: ‘టెలీకాం రంగంలో మరో విప్లవమైన 6జీ కి భారత్ సిద్ధం’ - పీఎం మోదీ
Independence Day: టెలీకాంలో మరో విప్లవం 6 జీ అని, అందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 5జీ నెట్ వర్క్ నుంచి 6జీ నెట్ వర్క్ కి మారడానికి భారత్ సిద్ధమవుతోందన్నారు.
Independence Day: టెలీకాంలో మరో విప్లవం 6 జీ అని, అందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 5జీ నుంచి 6జీ కి మారడానికి భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ లో 5జీ ని అత్యంత వేగంగా విస్తరించామన్నారు.
టాస్క్ ఫోర్స్
77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత టెలికాం రంగంలో త్వరలో రానున్న సిక్స్ జీ విప్లవం గురించి తెలిపారు. 6జికి భారత్ సిద్ధంగా ఉందని ఇందుకోసం ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేశామని ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. క్వాంటం కంప్యూటర్స్ దిశగా భారత్ దూసుకుపోతుందన్నారు. భారత్ లో 5జీ ని అత్యంత వేగంగా విస్తరించామన్నారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉందన్నారు. ‘‘5జీని అత్యంత వేగంగా దేశంలో విస్తరించాం. ఇప్పుడు 6జీ పై దృష్టి పెట్టాం. ఇందుకోసం ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశాం’’ అన్నారు.
డ్రోన్లతో వ్యవసాయం
ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల హవా కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా సాధించిన విజయం పై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయని తెలిపారు. ఇప్పుడు గ్రామాల్లో, వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడం కోసం ఒక కొత్త పథకాన్ని రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వేలాది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు శిక్షణను ఇస్తామన్నారు. వారికి డ్రోన్ల ఆపరేటింగ్ పై శిక్షణ అందించి డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగించేలా చూస్తామన్నారు. ఇందుకు 6జీ నెట్ వర్క్ ఎంతగానో ఉపయోగపడ్తుందని తెలిపారు.
టాపిక్