Arvind Kejriwal arrest : కేజ్రీవాల్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా నిరసనలు.. ‘ఇండియా’ కూటమి భారీ ప్లాన్!
Arvind Kejriwal arrest news : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా.. మార్చ్ 31న మెగా ర్యాలీ చేపట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
INDIA block on Arvind Kejriwal arrest : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరెస్ట్‌తో దిల్లీ అట్టుడుకుతోంది. ఆమ్ ఆద్మీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చెబుతున్నారు. ఈ నిరసనలు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా.. నిరసనలు చేపట్టాలని విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు పెద్ద ప్లాన్ రచించింది. మార్చ్ 31న ప్రతిపక్ష 'ఇండియా' కూటమి.. మెగా ర్యాలీ నిర్వహించనుందని దిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రాయ్ ఆదివారం ప్రకటించారు. లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంపై ఇప్పటికే బీజేపీ, ఇండియా కూటముల మధ్య మాటల యుద్ధం నెలకొన్న వేళ.. మెగా ర్యాలీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
విపక్ష కూటమి మెగా ర్యాలీ..
"దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్టు చేసిన తీరు పట్ల.. రాజ్యాంగాన్ని ప్రేమించే, గౌరవించే దేశ ప్రజలందరి గుండెల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం.. కేవలం అరవింద్ కేజ్రీవాల్ గురించి మాత్రమే కాదు, మొత్తం ప్రతిపక్షాన్ని ఒక్కొక్కటిగా తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది,' అని రాయ్ అన్నారు.
Liquor scam case explained : 'ప్రధాని మోదీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు లేదా బీజేపీలో చేరమని బెదిరిస్తున్నారు. అమ్ముకోవడానికి సిద్ధంగా లేని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు రాయ్.
దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. “రామ్‌లీలా మైదానం ఒక చారిత్రక ప్రదేశం. దేశంలో అతిపెద్ద విప్లవాలు రామ్‌లీలా మైదానం నుంచే ప్రారంభమయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రామ్ లీలా మైదానం నుంచే పుట్టుకొచ్చింది. 31న మెగా ర్యాలీ చేపడుతున్నాము. ఈ ర్యాలీలో అన్ని పార్టీల సీనియర్ నేతలు పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగిస్తారు,” అని తెలిపారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ అన్నారు. తమ నాయకుడు (కాంగ్రెస్ ఎంపీ) రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో తాము బలంగా ఉన్నామని చెప్పారు.
మార్చ్ 31 మెగా ర్యాలీ కేవలం రాజకీయ ర్యాలీ మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు వేదికగా మారుతుదని అభిప్రాయపడ్డారు అర్వింగ్ సింగ్ లవ్లీ.
జైలు నుంచే మొదటి ఆదేశాలు..
Arvind Kejriwal arrest latest news : మరోవైపు.. లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్.. అక్కడి నుంచి పని చేస్తున్నారు! దిల్లీలో ఉన్న మంచి నీటి కొరత సమస్యను పరిష్కరించాలని తమ మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత ప్రాంతాలకు వెంటనే మంచి నీటి ట్యాంకర్లను తరలించాలని సూచించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఆదేశాలతో కూడిన పత్రాలు.. దిల్లీ వాటర్ మినిస్టర్ అతిషికి అందాయి.
సీఎం పదవిలో ఉంది అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా నిలిచారు కేజ్రీవాల్. అయితే.. ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా, సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తేల్చి చెబుతోంది!
సంబంధిత కథనం