పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అట్టారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టును మూసివేయడం, మొత్తం హైకమిషన్ల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు.
ఈ దాడి సమాచారం తెలియగానే ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం భారతదేశానికి తిరిగి వచ్చారు. రాగానే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి దిశగా జమ్మూకశ్మీర్ నిలకడగా పురోగమిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సీసీఎస్ పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందనగా పాకిస్తాన్ తో సంబంధాల విషయంలో భారత్ 5 కఠిన నిర్ణయాలను ప్రకటించింది. అవి
సంబంధిత కథనం