Independence day 2023 live updates : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..-independence day 2023 live updates pm modi in delhi red fort news august 15 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Independence Day 2023 Live Updates : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..(HT TELUGU)

Independence day 2023 live updates : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

12:16 PM ISTAug 15, 2023 05:46 PM Sharath Chitturi
  • Share on Facebook
12:16 PM IST

  • Independence day 2023 live updates : దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

Tue, 15 Aug 202312:15 PM IST

‘టెలీకాం రంగంలో మరో విప్లవమైన 6జీ కి భారత్ సిద్ధం’ - పీఎం మోదీ

Independence Day: టెలీకాంలో మరో విప్లవం 6 జీ అని, అందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 5జీ నుంచి 6జీ కి మారడానికి భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ లో 5జీ ని అత్యంత వేగంగా విస్తరించామన్నారు.

Tue, 15 Aug 202309:35 AM IST

‘‘స్వీయ ప్రశంస.. పర నింద తప్ప మరేం లేదు’’- పీఎం మోదీ ఇండిపెండెన్స్ డే స్పీచ్ పై కాంగ్రెస్ స్పందన

Independence Day 2023: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేసింది. ఆ ప్రసంగం ఆద్యంతం స్వోత్కర్ష.. పరనిందలతో సాగిందని ఎద్దేవా చేసింది. ఎర్ర కోటపై ప్రధాని ఎన్నికల ప్రసంగం చేశారని విమర్శించింది. 

Tue, 15 Aug 202307:33 AM IST

విపక్షాల ఆగ్రహం..

ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన రోజున.. రాజకీయాల గురించి ఆయన మాట్లాడటం సరైనది కాదని అంటున్నాయి.

Tue, 15 Aug 202306:47 AM IST

మణిపూర్​ సీఎం స్పందన..

“మణిపూర్​ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని సందేశాన్ని ఇస్తున్నాను. హింసను వీడి, శాంతితో కలిసిమెలసి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” ఆ రాష్ట్ర సీఎం బీరేన్​ సింగ్​ వ్యాఖ్యానించారు.

Tue, 15 Aug 202305:46 AM IST

భారత్​కు ఫ్రాన్స్​ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలు భారత్​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్​ కూడా చేరింది. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవ్వాలని ఆకాంక్షించింది.

Tue, 15 Aug 202305:26 AM IST

కేంద్రంపై విమర్శలు..

దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విపక్షాల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Tue, 15 Aug 202305:09 AM IST

విజయవాడలో..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో పాటు పలువురు మంత్రులు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు ముందు సిఎం స్టేడియం మొత్తం కలియ తిరిగారు. ఆ తర్వాత జెండాను ఆవిష్కరించారు.

Tue, 15 Aug 202304:47 AM IST

ఎర్ర కోటపై మువ్వన్నెల జెండా..

ఎర్ర కోటలో జరిగిన వేడుకకు సంబంధించిన ఫొటోలను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 15 Aug 202304:15 AM IST

వివిధ రాష్ట్రాల్లో..

వివిధ రాష్ట్రాల్లో.. జెండా వందన కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. మధ్యప్రదేశ్​, బిహార్​ రాష్ట్రల ముఖ్యమంత్రులు.. వారి వారి రాజధానుల్లో జాతీయ జెండాలను అవిష్కరించారు.

Tue, 15 Aug 202303:49 AM IST

వారసత్వ రాజకీయాలు..

"వారసత్వం, బుజ్జగింపు రాజకీయాలతో దేశం చాలా నష్టపోయింది. ఒక పార్టీకి కేవలం ఒక కుటుంబమే ఎలా నియంత్రించగలదు? ఇలాంటి వారికి.. కుటుంబ రాజకీయాలే మంత్రంగా మారుతుంది," అని మోదీ అన్నారు.

Tue, 15 Aug 202303:26 AM IST

ఐకమత్యంతో ముందుకెళదాము..

“మనం ఐకమత్యంతో ఉండాలి. దేశాభివృద్ధి కోసం రానున్న 25 ఏళ్ల పాటు మనం ఐకమత్యంతో ముందుకెళ్లాలి,” అని మోదీ అన్నారు.

Tue, 15 Aug 202303:04 AM IST

అతిథుల మధ్య…

కేంద్ర మంత్రి అమిత్​ షా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​తో పాటు అనేక మంది ప్రముఖులు.. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొని, ప్రధాని మోదీ ప్రసంగాన్ని లైవ్​లో వీక్షించారు.

Tue, 15 Aug 202302:39 AM IST

యువతకు పిలుపు..

“భారత దేశంలో అవకాశాలకు కొదవు లేదు. భారత దేశంలో అవకాశాలకు అంతం లేదు. యువత దీనిని పరిగణించాలి,” అని మోదీ అన్నారు.

Tue, 15 Aug 202302:17 AM IST

మణిపూర్​లో శాంతి కోసం..

ఎర్ర కోట వేదకగా మణిపూర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. మణిపూర్​లో శాంతి నెలకొనాలని అభిప్రాయపడ్డారు. శాంతితోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు.

Tue, 15 Aug 202302:10 AM IST

ఎర్ర కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

ఎర్ర కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.  అనంతరం ఆ ప్రాంగణంలో ఐఏఎఫ్​ హెలికాఫ్టర్​.. పూల వర్షం కురిపించింది.

Tue, 15 Aug 202301:53 AM IST

ఎర్ర కోటకు ప్రధాని..

ప్రధాని మోదీ ఎర్ర కోటకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Tue, 15 Aug 202301:49 AM IST

రాజ్​ఘాట్​కు మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్​ఘాట్​కు వెళ్లారు. మహాాత్మా గాంధీకి నివాళులర్పించారు. 

Tue, 15 Aug 202301:33 AM IST

ఎర్ర కోట సిద్ధం..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం దిల్లీ ఎర్ర కోట సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ప్రధాని మోదీ ఎర్ర కోటకు చేరుకుంటారు. అతిథుల తాకిడి కూడా పెరుగుతోంది.

Tue, 15 Aug 202301:16 AM IST

మోదీ ట్వీట్​

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Tue, 15 Aug 202301:11 AM IST

జమ్ముకశ్మీర్​లో..

జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. శ్రీనగర్​ లాల్​ చౌక్​లో ప్రజలు జాతీయ జెండాలతో సందడి చేస్తున్నారు.

Tue, 15 Aug 202301:05 AM IST

విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Tue, 15 Aug 202312:54 AM IST

బ్యాంక్​లకు సెలవు

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంక్​లకు నేడు సెలవు. స్టాక్​ మార్కెట్​లకు కూడా హాలీడే.

Tue, 15 Aug 202312:46 AM IST

కేసీఆర్​ షెడ్యూల్​ ఇది..

ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్లో జాతీయ జెండాను ఎగరవేనున్న సీఎం కేసీఆర్

9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుండి పరేడ్ గ్రౌండ్ కు సీఎం కేసీఆర్

10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు

10 గంటల 15 నిమిషాలకు వీరుల సైనిక్ స్మారక చిహ్నం పరేడ్ గ్రౌండ్ నుండి 10 45 నిమిషాలకు గోల్కొండ కోటకు చేరుకోనున్న కేసీఆర్

10.50 నిమిషాలకు సీఎం కేసిఆర్ కు స్వాగతం పలకనున్న పోలీస్ గార్డ్స్

11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయనున్న సీఎం కేసీఆర్

11.5 నిమిషాలకు రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగం

Tue, 15 Aug 202312:44 AM IST

మోదీ ప్రసంగం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం కోసం యావత్​ భారత దేశం ఎదురుచూస్తోంది.

Tue, 15 Aug 202312:43 AM IST

దిల్లీలో హై అలర్ట్​

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దిల్లీలో హై అలర్ట్​ కొనసాగుతోంది. వేడుకలు జరగనున్న ఎర్ర కోట ప్రాంగణంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు.

Tue, 15 Aug 202312:42 AM IST

అర్ధరాత్రి నుంచే…!

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అర్ధరాత్రి నుంచే జరుగుతున్నాయి. తమిళనాడులోని పలు పాఠశాలలు.. అర్ధరాత్రి జండాను ఎగరేశాయి. ఇక తెల్లవారుజామున నుంచి పలు ప్రాంతాల్లో సాంస్కృతికి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.