Groom kisses bride : వరుడుకు వధువు షాక్​.. ముద్దు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు!-in up bride files police complaint after groom kisses her on stage at wedding ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Up Bride Files Police Complaint After Groom Kisses Her On Stage At Wedding

Groom kisses bride : వరుడుకు వధువు షాక్​.. ముద్దు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 02, 2022 07:45 AM IST

Groom kisses bride in wedding : పెళ్లి జరిగిన కొద్దిసేపటికి.. వధువకు ముద్దు పెట్టాడు వరుడు. కోపం తెచ్చుకున్న వధువు.. పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

వరుడుకు వధువు షాక్​.. ముద్దు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు!
వరుడుకు వధువు షాక్​.. ముద్దు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు! (HT_PRINT/representative image)

Groom kisses bride in wedding : పెళ్లిళ్ల సీజన్​ మొదలైపోయింది! దీనితో పాటు విచిత్ర సంఘటనలు కూడా మొదలయ్యాయి. పెళ్లి జరిగిన కొద్ది సేపటికే.. వరుడు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ వధువు. పెళ్లి పీటల మీద తనను ముద్దు పెట్టుకున్నాడని, తనకు ఇష్టం లేదని తేల్చిచెప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

వధువు రాక్స్​.. వరుడు షాక్స్​..!

ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. గత నెల 28న​ సంబల్​ జిల్లాలో సామూహిక వివాహ వేడుక జరిగింది. దాదాపు 300 జంటలు ఒక్కటయ్యాయి. కాగా.. ఇందులో ఓ జంట వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్​టాపిగ్​గా మారింది.

UP bride files case in groom : పెళ్లి జరిగిన కొద్ది సేపటికి.. వధూవరులు పూలమాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత.. స్టేజీ మీద కూర్చున్నారు. అప్పుడే.. వధువను వరుడు ముద్దుపెట్టాడు! అతని చర్యతో కోపం తెచ్చుకున్న వధువు.. పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు.. తిరిగి రావాలని ఆమెను వేడుకున్నారు. కానీ ఆ వధువు ఎవరి మాటా వినలేదు. చివరికి.. వధువు ఒత్తిడి చేయడంతో.. ఆమెను బహ్జోయ్​ పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు.

"300మంది ముందు తనని తాను నియంత్రించుకోలేక పోయిన మనిషి.. రేపు నాతో ఎలా ప్రవర్తిస్తాడు? నాకు ఈ పెళ్లి వద్దు. అతడితో కలిసి జీవించలేను," అని పోలీసులకు వెల్లడించింది ఆ వధువు.

పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. చివరికి.. ఇద్దరు వేరువేరుగా ఉండాలని ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. ఫలితంగా తమ జోక్యం లేకుండానే సమస్యకు పరిష్కారం లభించిందని పోలీసులు వెల్లడించారు.

వధువు చెప్పిందనే..!

UP wedding viral news : ఈ ఘటనతో వరుడు ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. అయితే.. వధువు చెప్పడంతోనే వరుడు ఆ సమయంలో ఆమెకు ముద్దుపెట్టినట్టు అతని తరఫు బంధువులు చెప్పడం గమనార్హం.

"పెళ్లి వ్యవహారం ప్రారంభమయ్యే కొద్ది సేపటి ముందు.. వరుడితో వధువు బెట్​ కట్టింది. అందరి ముందు తనను కిస్​ చేస్తే రూ. 1500 ఇస్తానని, లేకపోతే వరుడు రూ. 3000 ఇవ్వాలని బెట్​ వేసింది. అందుకే ఆమెను వరుడు ముద్దుపెట్టుకున్నాడు," అని కొందరు చెప్పారు.

ఈ విషయంపై పోలీస్​ స్టేషన్​లో పోలీసుల ముందు వధువును కొందరు నిలదీశారు. తనకేమీ తెలియదని, తాను అలా చెప్పలేదని ఆమె తేల్చిచెప్పింది.

ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం