cow vigilants: గోరక్షకుల మరో దారుణం!; ఇద్దరి దారుణ హత్య-in haryana 2 charred bodies found inside bolero kin alleges bajrang dal role
Telugu News  /  National International  /  In Haryana, 2 Charred Bodies Found Inside Bolero; Kin Alleges Bajrang Dal Role
మృతదేహాలు కనిపించిన బొలెరో వాహనాన్నిపరిశీలిస్తున్న పోలీసులు
మృతదేహాలు కనిపించిన బొలెరో వాహనాన్నిపరిశీలిస్తున్న పోలీసులు (ANI)

cow vigilants: గోరక్షకుల మరో దారుణం!; ఇద్దరి దారుణ హత్య

17 February 2023, 15:03 ISTHT Telugu Desk
17 February 2023, 15:03 IST

హరియాణాలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. గోరక్షకులే (cow vigilants) ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

Haryana crime news: హరియాణాలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను మహింద్ర బొలెరో కారులో గురువారం గుర్తించారు. కారు కూడా పాక్షికంగా తగలబడిపోయి ఉంది. గో రక్షకులే (cow vigilante) ఈ నేరానికి పాల్పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

cow vigilante violence: రాజస్తాన్ టు హరియాణా

హరియాణాలోని బివానీ జిల్లాలో ఉన్న లొహారు సమీపంలో ఈ కారును పోలీసులు గుర్తించారు. కారులో కాలిపోయి ఉన్న స్థితిలో ఉన్న మృతదేహాలు రాజస్తాన్ కు చెందిన 35 ఏళ్ల జునాయిద్, 25 ఏళ్ల నాసిర్ లుగా నిర్ధారించారు. వారు రాజస్తాన్ లోని భరత్ పూర్ జిల్లా, పహారీ తహసిల్లోని ఘట్మీకా గ్రామానికి చెందిన వారు. వారిని బుధవారం వారి ఇంటి నుంచి తీసుకువచ్చి, హతమార్చినట్లు భావిస్తున్నారు.

cow vigilante violence: గోరక్షకుల పనేనా!

జునాయిద్, నాసిర్ లను రాజస్తాన్ లోని వారి ఇంటి నుంచి తీసుకువచ్చింది గోరక్షకులేనని (cow vigilante violence) భావిస్తున్నారు. జునాయిద్, నాసిర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ పిల్లలను అపహరించినవారు భజరంగ్ దళ్ (Bajrang Dal) కు చెందిన వారని పేర్కొనడం గమనార్హం. అయితే, ఇది గోరక్షణ పేరుతో జరిగిన హత్యా? లేక వేరే కారణముందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాలిపోయి ఉన్న కారు గురించి ఒక గ్రామస్తుడు సమాచారం ఇచ్చాడని, ఘటనా స్థలానికి వెళ్లిన తమకు, ఆ కారులో కాలిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కనిపించాయని డీఎస్పీ జగత్ సింగ్ వివరించారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ నుంచి కాలిపోయిన స్థితిలో కారు కనిపించన ప్రాంతం సుమారు 200 కిమీలు. హత్య చేసిన తరువాత ఇక్కడికి తీసుకువచ్చి, కార్లోనే మృతదేహాలను ఉంచి కాల్చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

FIR on five including Bajrang Dal leader: ఐదుగురిపై కేసు

జునాయిద్, నాసిర్ ల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భజరంగ్ దళ్ (Bajrang Dal) నేత మోహిత్ యాదవ్ అలియాస్ మోను మానెసర్ సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని భరత్ పూర్ ఎస్పీ శ్యామ్ సింగ్ వెల్లడించారు. మృతుల్లో ఒకరైన జునాయిద్ కు నేర చరిత్ర ఉందని వెల్లడించారు. ఇది వ్యక్తిగత కక్షలు లేదా వేరే కారణాలతో జరిగిన హత్యలా? లేక గో రక్షణ పేరుతో జరిగిన హత్యలా? అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.

Monu Manesar role: భజరంగ్ దళ్ నేత మోను మానెసర్ పాత్ర ఉందా?

జునాయిద్, నాసిర్ ల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో భజరంగ్ దళ్ (Bajrang Dal) నేత మోహిత్ యాదవ్ అలియాస్ మోను మానెసర్ పేరు కూడా ఉంది. మోను మానెసర్ యూట్యూబర్ కూడా. అతడి యూట్యూబ్ చానెల్ కు సుమారు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ నేరంతో తనకు సంబంధం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మోనూ వివరణ ఇచ్చాడు. మోను మానెసర్ కు నేర చరిత్ర ఉంది. ఫిబ్రవరి 6న తన లైసెన్స్ డ్ గన్ తో కాల్పులు జరిపి, 6 ఏళ్ల బాలికను గాయపర్చాడని ఆయనపై కేసు నమోదై ఉంది. అలాగే, జనవరి 28న ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఒక 22 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఆ వ్యక్తి ఆ తరువాత హాస్పిటల్ లో చనిపోయాడు.