Bihar rape case : 5ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి.. 5 ‘గుంజీల’ శిక్ష!-in bihar village 5 sit ups is punishment for raping girl aged 5 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Bihar Village, 5 Sit-ups Is Punishment For Raping Girl Aged 5

Bihar rape case : 5ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి.. 5 ‘గుంజీల’ శిక్ష!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 11:23 AM IST

Rapist gets situps punishment : బిహార్​లో ఓ రేపిస్ట్​కు పడిన శిక్ష.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 5ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి.. 5 గుంజీల శిక్ష విధించి వదిలేశారు గ్రామ పెద్దలు

గుంజీలు తీస్తున్న నిందితుడు
గుంజీలు తీస్తున్న నిందితుడు

Rapist gets situps punishment : అత్యాచారానికి పాల్పడితే.. ఉరి శిక్ష విధించి, సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తున్న దేశాలు ఓవైపు ఉంటే.. ఇండియాలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 5ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి.. '5 గుంజీల' శిక్ష పడింది!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

బిహార్​ నవాడాలోని ఓ గ్రామంలో.. ఓ 5ఏళ్ల చిన్నారిపై ఓ కిరాతకుడు కన్ను పడింది. చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపించి తనతో పాటు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. తన పౌల్ట్రీ ఫామ్​లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంతలో స్థానికులకు దొరికిపోయాడు. వెంటనే పంచాయతీని ఏర్పాటు చేసి.. గ్రామ పెద్దల ముందు నిలబెట్టారు.

Bihar rape case : ఈ వ్యవహారంలో అసలైన షాకింగ్​ ఘటన ఇక్కడే చోటుచేసుకుంది. వ్యక్తికి 5 గుంజీల శిక్షను ప్రకటించారు పంచాయతీ పెద్దలు. బాలిక అత్యాచారానికి గురైందని స్థానికులు చెప్పినా.. వారిని పట్టించుకోలేదు. 'బాలికపై అత్యాచారం జరగలేదు. కానీ ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లడమే తప్పు. అందుకే ఈ శిక్ష వేశాము,' అని గ్రామ పెద్దలు చెప్పడం గమనార్హం. ఈ మాటలు విని.. బాలిక తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

అదే సమయంలో.. గ్రామ పెద్దల ఆదేశాలతో.. 5 గుంజీలు తీశాడు నిందితుడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఈ పూర్తి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Bihar crime news : గ్రామ పెద్దలు విధించిన శిక్షపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని అంటున్నారు. ఈ వీడియోకు.. బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ట్విట్టర్​​ అకౌంట్​లను ట్యాగ్​ చేశారు. 'తప్పు చేసిన వారికి శిక్ష పడదా?' అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. పూర్తి వ్యవహారంపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు వివరించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం