Son kills father over fight : తండ్రిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!-in bengal son kills father over fight body chopped into pieces report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Son Kills Father Over Fight : తండ్రిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!

Son kills father over fight : తండ్రిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 09:03 AM IST

Son kills father over fight : మద్యం తాగొచ్చి కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గొడవ తర్వాత.. తండ్రిని కొడుకు చంపి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటిని పడేసేందుకు తల్లి సాయం చేసింది.

తండ్రిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!
తండ్రిని హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి!

Son kills father over fight : పశ్చిమ్​ బెంగాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిని హత్య చేసిన ఓ వ్యక్తి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తల్లి సాయంతో.. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

మద్యం మత్తులో..

55ఏళ్ల ఉజ్వల్​ చక్రవర్తి.. దక్షిణ 24 పరగాణాస్​ జిల్లాలోని బరౌపూర్​ ప్రాంతంలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆయన.. ఇండియన్​ నేవీలో కానిస్టేబుల్​గా పని చేసి 2000లో రిటైర్​ అయ్యారు.

Body chopped into pieces : కానీ ఆయనకు మద్యం సేవించే అలవాటు ఉంది. తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నెల 14న కూడా ఇదే జరిగింది. మద్యం తాగి ఇంటికి వచ్చిన చక్రవర్తి.. తన కుమారుడు జోయ్​ చక్రవర్తితో గొడవ పెట్టుకున్నాడు. కోపంతో ఊగిపోయిన కుమారుడు.. తండ్రిని చంపేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వాటిని పడేసేందుకు.. తల్లి తన బిడ్డకు సాయం చేసింది.

ఇది జరిగిన కొన్ని రోజులకు.. చక్రవర్తి కుటుంబసభ్యులు పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. చక్రవర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు దొరికిపోయారు.

West Bengal crime news : "ఈ నెల 14న తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఏదో ఫీజు కోసం డబ్బులు కావాలని 25ఏళ్ల జోయ్​ చక్రవర్తి.. తండ్రిని అడిగాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రి.. కుమారుడిపై చెయ్యి చేసుకున్నాడు. కోపంతో.. తండ్రిని చంపేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కులుగా కోసి సమీపంలోని ప్రాంతాల్లో పడేశాడు. ఇందుకు.. అతడి తల్లి 50ఏళ్ల శ్యామలి చక్రవర్తి సాయం చేసింది. శరీరంలోని కొన్ని భాగాలు ఇంకా కనిపించలేదు. ఇంకొన్నింటినీ స్వాధీనం చేసుకున్నాము," అని పోలీసులు వివరించారు.

20ఏళ్లుగా.. చక్రవర్తి తన కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

సంబంధిత కథనం