Assam Woman Murdered : అసోంలో దారుణం- తల్లిని చంపి, పసికందును అపహరించి..-in assam woman murdered her baby stolen by couple to give to daughter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  In Assam Woman Murdered, Her Baby Stolen By Couple To Give To Daughter

Assam Woman Murdered : అసోంలో దారుణం- తల్లిని చంపి, పసికందును అపహరించి..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 24, 2022 01:25 PM IST

Assam Woman Murdered : వారి బిడ్డకు పెళ్లైంది. కానీ ఆమెకు సంతానం లేదు. బిడ్డ సంతోషం కోసం ఆ దంపతులు దారుణానికి ఒడిగట్టారు. వేరే మహిళను చంపి, ఆ తల్లి వద్ద ఉన్న 10నెలల పసికందును అపహరించారు. ఈ నేరంలో.. బాధితురాలి తల్లి పాత్ర కూడా ఉంది! అసోంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

అసోంలో దారుణం- తల్లిని చంపి, పసికందును అపహరించి..
అసోంలో దారుణం- తల్లిని చంపి, పసికందును అపహరించి..

Assam Woman Murdered : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి, పసికందును తమ కూతురికి ఇచ్చేందుకు దంపతులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తల్లిని చంపేశారు. బాధితురాలి తల్లి కూడా ఈ నేరంలో పాలుపంచుకోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

నితుమోని లుఖురంఖోన్​ అనే మహిళ ఇటీవలే ఓ బిడ్డకు జన్మించింది. 10నెలల పసికందుతో కలిసి కేందుగురి బైలుంగ్​ గ్రామంలో నివాసముంటోంది. గత సోమవారం సాయంత్రం.. సిమలుగురి మార్కెట్​ నుంచి వీరిద్దరు కనిపించకుండాపోయారు. మంగళవారం ఉదయం.. నితుమోని మృతదేహం.. చరైదియో జిల్లాలోని రాజాబరి టీ ఎస్టేట్​ డ్రైనేజ్​లో కనిపించింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సిమలుగురి, సివసాగర్​, చరైదియో, జోర్హాట్​ పోలీసులు జాయింట్​ ఆపరేషన్​ను నిర్వహించి.. జోర్హాట్​లో 10నెలల పసికందును స్వాధీనం చేసుకున్నారు.

Assam crime news : ఈ క్రమంలోనే నలుగురిని అరెస్ట్​ చేశారు. వీరిలో దంపతులు, వారి కుమారుడు, బాధితురాలి తల్లి ఉన్నారు. అసలేం జరిగిందన్న విషయం.. పోలీసుల విచారణలో బయటపడింది.

దంపతులు ప్రనాలి గగోయ్​(హిరామై), బసంత గగోయ్​లకు ఓ బిడ్డ ఉంది. పెళ్లి జరిగిన తర్వాత ఆమె హిమచల్ ​ప్రదేశ్​లో నివాసముంటోంది. కానీ ఆమెకు సంతానం లేదు. ఆమెకు బిడ్డను ఇచ్చేందుకే.. నితుమోనిని చంపేశారు ఆ దంపతులు!

"ఇదొక ప్రీప్లాన్డ్​ మర్డర్.​ ఏదో పని మీద.. దంపతులు బాధితురాలని పిలిపించారు. వారి కుమారుడు ప్రశాంత గగోయ్​ కూడా అక్కడే ఉన్నాడు. బిడ్డను తల్లి నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే తల్లిని బలమైన ఆయుధంతో కొట్టారు. ఫలితంగా ఆమె మరణించింది. ఆ పసికందుతో ప్రశాంత​ గగోయ్​ హిమాచల్​ ప్రదేశ్​కు బయలుదేరాడు. మేము దంపతులను అరెస్ట్​ చేసే సమయానికి అతను ట్రైన్​ ఎక్కేశాడు. ఆ తర్వాత.. ట్రైన్​లోనే ఆతడిని అరెస్ట్​ చేశాము. ఈ నేరంలో బాధితురాలి తల్లి బోబి లుఖురంఖోన్​ పాత్ర కూడా ఉంది," అని శివసాగర్​ పోలీస్​ స్టేషన్​ సీనియర్​ అధికారి శుభ్రజ్యోతి బరోహ్​ వెల్లడించారు.

Woman killed in Assam : నలుగురు నిందితులను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వారిని కస్టడీకి పంపిస్తూ.. కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. హిమాచల్​ ప్రదేశ్​లో నివాసముంటున్న దంపతుల కుమార్తెకు.. ఈ నెరంతో ఏమైనా సంబంధం ఉందా? లేదా ఆమెకు తెలియకుండానే వారు ఈ విధంగా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం