Imran Khan : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కి 14ఏళ్ల జైలు శిక్ష- భార్యకు..-imran khan former pak pm sentenced to 14 years in jail in land corruption case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imran Khan : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కి 14ఏళ్ల జైలు శిక్ష- భార్యకు..

Imran Khan : పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కి 14ఏళ్ల జైలు శిక్ష- భార్యకు..

Sharath Chitturi HT Telugu
Jan 17, 2025 01:19 PM IST

భూ అవినీతి కేసులో పాకిస్థాన్​ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​కి 14ఏళ్ల జైలు శిక్షపడింది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఆయన భార్య బుష్రా బీబీకి 7ఏళ్ల జైలు శిక్ష పడింది.

14ఏళ్లు జైల్లోనే ఇమ్రాన్​ ఖాన్​..!
14ఏళ్లు జైల్లోనే ఇమ్రాన్​ ఖాన్​..! (AFP)

పాకిస్థాన్​ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్​ ఖాన్​కి భారీ షాక్!​ అల్ ఖాదిర్ ట్రస్టుకు సంబంధించిన భూ అవినీతి కేసులో ఇమ్రామ్ ఖాన్​కు స్థానిక కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఇదే కేసులో భాగంగా ఆయన భార్య బుష్రా బీబీకి 7ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టు తీర్పును వెలువరించింది.

yearly horoscope entry point

ఇమ్రాన్​ ఖాన్​కి 14ఏళ్ల జైలు శిక్ష..

తన పాలనలో జరిగిన అనేక అవినీతి కార్యకలాపాలు ఇప్పుడు ఇమ్రాన్​ ఖాన్​కి ఇబ్బందికరంగా మారాయి. మరీ ముఖ్యంగా ఈ భూ అవినీతి కేసును ఇమ్రాన్​ ఖాన్​ పాలనలో జరిగిన అతిపెద్ద ఆర్థిక తప్పిదంగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఖాన్​ 2023 ఆగస్ట్​ నుంచి రావల్పిండి జైలులో ఉంటున్నారు.

వివిధ కారణాలతో మూడుసార్లు వాయిదా పడిన ఈ కేసు తీర్పును అవినీతి నిరోధక కోర్టు న్యాయమూర్తి నాసిర్ జావేద్ రాణా తాజాగా వెలువరించారు. ఆదిలా జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి ఈ తీర్పును ప్రకటించారు.

ఖాన్ (72), ఆయన భార్య బుష్రా బీబీ (50), మరో ఆరుగురిపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) 2023 డిసెంబర్​లో కేసు నమోదు చేసింది.

అయితే ఈ కేసుకు సంబంధించి ప్రాపర్టీ టైకూన్ మాలిక్​ రయీజ్​​ సహా మిగతా వారంతా దేశం వెలుపల ఉండటంతో ఖాన్, బీబీలపై మాత్రమే విచారణ జరిగింది.

సదరు ప్రాపర్టీ టైకూన్​తో సెటిల్​మెంట్​లో భాగంగా.. యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ పాకిస్థాన్​కి తిరిగి ఇచ్చిన 50 బిలియన్ పాకిస్థానీ రూపాయల మొత్తాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది.

ఈ నిధులు జాతీయ ఖజానాకు ఉద్దేశించినవని, కానీ విశ్వవిద్యాలయం ఏర్పాటులో తమకు సహకరించిన సరు వ్యాపారావేత్త వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీటిని మళ్లించినట్టు బీబీ- ఖాన్​లపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ సెటిల్​మెంట్​లో భాగంగా అల్​ ఖాదిర్​ ట్రస్ట్​కి ట్రస్టీగా ఉన్న బీబీకి ఝీలమ్​లోని అల్​ ఖాదిర్​ వర్సిటీ కోసం 480 కెనాళ్ల (57 ఎకరాలు) భూమికి సంబంధించిన ప్రయోజనాలు దక్కాయని తెలుస్తోంది.

తీర్పు వెలువరిన అనంతరం కోర్టులోనే ఉన్న బీబీని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్​ చేసి జైలుకు తరలించారు.

ఈ పూర్తి వ్యవహారాన్ని ఇమ్రాన్​ ఖాన్​ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయాలేదని అరెస్ట్​ అయినప్పటి నుంచి చెబుతూ వచ్చారు ఖాన్​. ఇదంతా ప్రత్యర్థులు తనపై చేసిన కుట్రగా అభివర్ణించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.