Karnataka politics: పట్టువీడని డీకే; కాంగ్రెస్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభన-impasse continues in cm selection of karnataka congress as dk and siddhu defiant ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Impasse Continues In Cm Selection Of Karnataka Congress As Dk And Siddhu Defiant

Karnataka politics: పట్టువీడని డీకే; కాంగ్రెస్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభన

HT Telugu Desk HT Telugu
May 17, 2023 05:56 PM IST

Karnataka politics: కర్నాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం చూపుతున్న వేర్వేరు ప్రత్యామ్నాయాలను సీఎం రేసులో ఉన్న సిద్ధ రామయ్య, శివకుమార్ లు అంగీకరించడం లేదు.

ఢిల్లీలో మద్దతుదారులైన పార్టీ ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ మంతనాలు
ఢిల్లీలో మద్దతుదారులైన పార్టీ ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ మంతనాలు (PTI)

Karnataka politics: కర్నాటక కాంగ్రెస్ (Karnataka Congress) లో ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పదవికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం చూపుతున్న వేర్వేరు ప్రత్యామ్నాయాలను సీఎం రేసులో ఉన్న సిద్ధ రామయ్య, శివకుమార్ లు అంగీకరించడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Karnataka politics: రొటేషనల్ కు ఓకే.. కానీ నాకే ముందు

కర్నాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి రెండేళ్లు ఒకరు, తరువాతి మూడేళ్లు మరొకరు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలన్న ప్రతిపాదనకు కొంతవరకు అంగీకారం తెలిపిన శివకుమార్.. మొదట సీఎంగా తనకే అవకాశం ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాల పరిమితితో మొదట సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, అందుకు సిద్ధరామయ్య అభ్యంతరం తెలిపారని, మొదటి రెండేళ్లు తానే సీఎంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారని సమాచారం.

Karnataka politics: ఉప ముఖ్యమంత్రి పదవి వద్దు

కాంగ్రెస్ పార్టీలో కర్నాటక సీఎం ఎంపిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ లు పట్టు వీడడం లేదు. సిద్ధ రామయ్యకు సీఎం పదవి, శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తామన్న ప్రతిపాదనను డీకే తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి మినహా ఏమిచ్చినా తనకు వద్దని డీకే శివకుమార్ స్పష్టం చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Karnataka politics: రూమర్లు నమ్మవద్దు

కర్నాటక సీఎంగా సీనియర్ నేత సిద్ధ రామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిందన్న వార్తలు నిజం కాదని, కర్నాటక సీఎం గా ఎవరు ఉండాలన్న విషయమై ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

WhatsApp channel