Rainfall alert : భానుడి భగభగల నుంచి రిలీఫ్​.. ఈ రాష్ట్రాలకు వర్ష సూచన!-imd predicts rainfall in 11 states snowfall to grace the himalayas ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rainfall Alert : భానుడి భగభగల నుంచి రిలీఫ్​.. ఈ రాష్ట్రాలకు వర్ష సూచన!

Rainfall alert : భానుడి భగభగల నుంచి రిలీఫ్​.. ఈ రాష్ట్రాలకు వర్ష సూచన!

Sharath Chitturi HT Telugu
Mar 12, 2024 08:11 AM IST

Rainfall alert in India : 11 రాష్ట్రాల్లో.. రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు, మంచు కురుస్తుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు దిగొస్తాయని పేర్కొంది.

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు!
రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు! (ANI Pic Service)

IMD rainfall alert : ఉత్తర భారతంలో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రజలకు గుడ్​ న్యూస్​ చెప్పింది భారత వాతావరణశాఖ ఐఎండీ. రానున్న రోజుల్లో 11 రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తుందని స్పష్టం చేసింది.

ఈ రాష్ట్రాల్లో మంచు.. వర్షాలు..!

జమ్ముకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఈ నెల 13, 14 తేదీల్లో.. ఉరములతో కూడిన వర్షాలు, హిమపాతం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాతి నుంచి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని స్పష్టం చేసింది.

వాయువ్య ప్రాంతంలో వెస్టెర్న్​ డిస్టర్బెన్స్​ కొనసాగుతోందని చెప్పింది ఐఎండీ. ఫలితంగా.. పంజాబ్​, హరియాణా, ఛండీగఢ్​, ఉత్తర్​ ప్రదేశ్​, రాజస్థాన్​లో ఈ నెల 13న, అంటే బుధవారం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rains in North India : మరోవైపు.. పశ్చిమ్​ బెంగాల్​, సిక్కింలో మార్చ్​ 14 వరకు తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. మార్చ్​ 13 నుంచి 17 వరకు.. పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నదీ తీర ప్రాంతాల్లో వర్షాలు కురవొచ్చు.

ఒడిశాలో కూడా ఈ నెల 14 నుంచి 17 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఝార్ఖండ్​, మధ్య ప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​లో 16, 17 తేదీల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

ఇక ఈశాన్య భారతం విషయానికొస్తే.. రానున్న మూడు రోజుల పాటు అసోం, మేఘాలయ, నాగాలాండ్​, మణిపూర్​, మిజోరం, త్రిపురల్లో వర్షాలు పడతాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో మాత్రం 6 రోజుల పాటు మంచు కురవొచ్చు.

Hyderabad temperature today : ఇక దిల్లీలో సోమవారం 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చ్​ నెలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. మంగళవారం కూడా టెంపరేచర్​ ఇదే విధంగా ఉండొచ్చని, బుధవారం నుంచి వర్షాల ప్రభావంతో కాస్త తగ్గొచ్చని అధికారులు చెబుతున్నారు.

దక్షిణాది ప్రాంతాల్లో పరిస్థితి ఇలా..

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వేడి వాతావరణమే ఉండొచ్చు! కేరళ, ఆంధ్రప్రదేశ్​, పుదుచ్చెరీలో రానున్న 2, మూడు రోజుల పాటు వేడి వాతావరణమే ఉంటుంది. ఆ తర్వాత కూడా వర్షాలు పడకపోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు బయట తిరగడానికి కష్టమవుతోంది. ఉక్కపోత చాలా తీవ్రంగా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం