IMD rain alert : ఆంధ్ర, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో ఇక జోరుగా వర్షాలు..!
Telangana rain alert : దక్షిణ, వాయవ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూలై 5 నుంచి 7వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రానున్న వారం రోజుల పాటు వాయవ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
జమ్ముకశ్మీర్-లద్దాఖ్-గిల్గిట్-బాల్టిస్థాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా-చంఢీగఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వారం మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జులై 5న జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, 5 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్, 5న పంజాబ్, 5, 6 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఈశాన్య భారతం..
జూలై ప్రారంభంలో నిర్దిష్ట తేదీల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండ. జూలై 5న బిహార్‌లో భారీ వర్షాలు, జూలై 6 వరకు సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూలై 6న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని, జూలై 6, 7 తేదీల్లో అసోం, మేఘాలయ, 7న ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జూలై 5న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కేరళ, మాహే, లక్షద్వీప్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తాంధ్ర, యానాం, ఇంటీరియర్ కర్ణాటకలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ కాలంలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
దక్షిణ భారతం..
కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఈ నెల 7, 8వ తేదీన, కోస్తా కర్ణాటక 8వ తేదీన, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక జూలై 5, వర్షాలు కురుస్తాయి. 4 నుంచి 6 వరకు కొంకణ్, గోవా, 4 నుంచి 8 వరకు మధ్య మహారాష్ట్ర, 4 నుంచి 8 వరకు సౌరాష్ట్ర, కచ్, 4 నుంచి 7 వరకు కోస్తా కర్ణాటక, 4, 6, 7 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా రెండు రోజులు ముందే దేశంలోకి ప్రవేశించినా, జూన్ నెల వర్షపాతం ఎక్కువగా కనిపించలేదు! సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. ఇక జులైలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
ఎల్ నీనో కారణంగా గతేడాది వర్షాలు సరిగ్గా పడలేదు. వ్యవసాయంతో పాటు అనేక నగరాల్లో నీటి కొరత కనిపించింది. ఇప్పుడు ఎల్ నీనో ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈసారి సాధారణం కన్నా ఎక్కువ వర్షం నమోదవ్వొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే, రుతుపవనాల మొదటి భాగంలో కాకుండా, రెండో భాగంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కొన్ని నెలల క్రితం వివరించింది.
సంబంధిత కథనం