IMD predictions: ‘‘భారీ నుంచి అతి భారీ’’.. సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ-imd predicts above normal rainfall in september very heavy showers in ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Predictions: ‘‘భారీ నుంచి అతి భారీ’’.. సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ

IMD predictions: ‘‘భారీ నుంచి అతి భారీ’’.. సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ

Sudarshan V HT Telugu
Aug 31, 2024 08:11 PM IST

సెప్టెంబరులో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి అంచనా వేసింది. వాయవ్య భారత్ లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని, ఈశాన్య భారతదేశం దక్షిణ భారతదేశం లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది.

సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన ఐఎండీ
సెప్టెంబరు నెలలో వర్షపాతం వివరాలను వెల్లడించిన ఐఎండీ (PTI)

సెప్టెంబర్ నెలలో, అంటే రాబోయే 4 వారాల్లో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 'అత్యంత భారీ వర్షాలు' కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 'సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం' కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య భారతదేశం, పరిసర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షపాతం ఉంటుందని పేర్కొంది.

ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ

వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి (IMD) చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర శనివారం తెలిపారు. సెప్టెంబర్ లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, అంటే దీర్ఘకాలిక సగటు 167.9 మిల్లీమీటర్లలో 109 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య భారతదేశంలో ఆగస్టు నెలలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం (rain) నమోదైంది. ఇది 2001 తరువాత రెండవ అత్యధికం.

హిమాలయాల్లో తక్కువ వర్షపాతం

హిమాలయ పర్వత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, చాలా వరకు అల్పపీడన వ్యవస్థలు వాటి సాధారణ స్థానానికి దక్షిణంగా కదులుతున్నాయని, రుతుపవనాల ద్రోణి కూడా దాని సాధారణ స్థానానికి దక్షిణంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంతో పాటు ఈశాన్యంలోని పలు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదవుతుందని (IMD Alerts) మహాపాత్ర తెలిపారు.

ఆస్నా తుఫాను వల్ల..

గుజరాత్ ను ఆస్నా తుపాను అతలాకుతలం చేయడంతో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా, భారత తీరానికి దూరంగా రానున్న 24 గంటల్లో కదులుతుంది. గత 24 గంటల్లో కచ్ లో భారీ వర్షాలు కురిశాయి. జూన్ 1 నుంచి గుజరాత్ లో 882 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 50% ఎక్కువ. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అహ్మదాబాద్, గాంధీనగర్లో శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.