IIT-Kharagpur: ఐఐటీ ఖరగ్ పూర్ లో ‘ఏఐ’ పై 3 నెలల ఆన్ లైన్ కోర్సు.. టీసీఎస్ భాగస్వామ్యంతో..
IIT-Kharagpur: విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను సిద్ధం చేసే లక్ష్యంతో ఐఐటీ ఖరగ్ పూర్ కొత్తగా కృత్రిమ మేథ (artificial intelligence AI) పై ఒక మూడు నెలల ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సును డిజైన్ చేసింది.
IIT-Kharagpur: విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను సిద్ధం చేసే లక్ష్యంతో ఐఐటీ ఖరగ్ పూర్ కొత్తగా కృత్రిమ మేథ (artificial intelligence AI) పై ఒక మూడు నెలల సర్టిఫికెట్ ఆన్ లైన్ కోర్సును డిజైన్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
అప్ డేట్ కావాల్సిందే..
ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సంపాదించాలన్నా, అందులో నిలదొక్కుకోవాలన్నా ఎప్పటికప్పుడు స్కిల్స్ ను అప్ డేట్ చేసుకోవడం అవసరం. డిగ్రీ వచ్చేసింది కదా, ఇక చాల్లే అని నిర్లక్ష్యం చేస్తే, వెనుకబడి పోవడమో, లే ఆఫ్ లకు బలి కావడమో జరుగుతుంది. అందువల్ల, వివిధ కంపెనీలు ఇన్ హౌజ్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ లను నిర్వహిస్తుంటాయి. కొన్ని విద్యా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను, సిలబస్ లను రూపొందిస్తుంటాయి.
ఏఐపై ఆన్ లైన్ కోర్సు..
ఐఐటీ ఖరగ్ పూర్ కూడా కొత్తగా కృత్రిమ మేథ (artificial intelligence AI) పై ఒక మూడు నెలల ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సును డిజైన్ చేసింది. విద్యార్థులు ఈ ఆన్ లైన్ కోర్సులో చేరి ఏఐ పై అవగాహన పెంచుకోవచ్చు. భవిష్యత్ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. ఈ కోర్సు మూడు నెలల పాటు ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ క్లాస్ లు వారాంతాలలో మాత్రమే ఉంటాయి. టీసీఎస్ ఐయాన్ (TCS iON) భాగస్వామ్యంతో హ్యాండ్స్ ఆన్ ఏఐ ఫర్ ద రియల్ వరల్డ్ అప్లికేషన్స్ (Hands-on AI for the real-world applications పేరుతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఐఐటీ ఖరగ్ పూర్ లోని కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మేథమెటిక్స్ డిపార్ట్మెంట్స్ కు చెందిన ఫాకల్టీ ఈ ఆన్ లైన్ క్లాసెస్ తీసుకుంటారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.
కొత్త ఎన్ఈపీలో భాగంగా..
భవిష్యత్ ఇండస్ట్రీ అవసరాలను తీర్చడంతో పాటు ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానం (NEP)లోని లక్ష్యాలను సాధించడం కోసం ఈ సర్టిఫికెట్ కోర్సుకు రూపకల్పన చేశారు.