IIT Madras: 6 కొత్త స్కిల్ బేస్డ్ కోర్సులను ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
IIT Madras: ఐఐటీ మద్రాస్ ఆరు కొత్త, నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రారంభించింది. వీటిని ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో స్వయం ప్లస్ పై ఐఐటీ మద్రాసుకు చెందిన నిపుణులు అభివృద్ధి చేశారు.
IIT Madras: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) స్వయం ప్లస్ నేషనల్ వర్క్ షాప్ - 'స్కిల్ స్కేప్ 2024 (Skillscape 2024)' ను నిర్వహిస్తోంది. ఇది 'ఉన్నత విద్య, కొత్త నైపుణ్యాల భవిష్యత్తు థీమ్ గా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. స్వయం ప్లస్ అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ సంయుక్త చొరవ. ఇది నూతన విద్యా విధానం 2020 కు అనుగుణంగా ఉపాధి-కేంద్రీకృత, నైపుణ్య కోర్సులను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఇది రూపొందింది.
ఆరు కొత్త కోర్సులు
ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ స్వయం ప్లస్ లో ఆరు కొత్త, నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రారంభించింది. 'అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ ' ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి కోర్సు, 'సీఎన్ సీ మెషినింగ్ '- ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ తో కూడిన ఫండమెంటల్స్ , కాంప్రహెన్సివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ' ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి కోర్సు, 'డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ ' ఎన్ సీఆర్ ఎఫ్ 4.5 స్థాయి, 'స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ ' – ఫండమెంటల్స్ వంటి కోర్సులను ప్రారంభించారు.
విద్యార్థి కేంద్రంగా..
ఒక విద్యార్థి అవసరమైన క్రెడిట్స్ పొందగలిగితే 3 లేదా 4 సంవత్సరాలకు ముందే డిగ్రీని పూర్తి చేయడం గురించి ఆలోచించవచ్చు. కేవలం ఇన్ స్టిట్యూట్ పైనే కాకుండా అభ్యాసకుడిపై కూడా దృష్టి కేంద్రీకరిస్తామని అర్థం చేసుకున్నాం. క్యాంపస్ లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆన్ లైన్ తో పాటు పలు ఇతర ప్లాట్ ఫామ్ లలో కోర్సులను అందించవచ్చు. 'లెర్నింగ్', 'లెర్నర్స్' కోణంలో ఆలోచించడం ప్రారంభించినందున ఈ అవకాశం వచ్చింది" అని విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యాశాఖ అదనపు కార్యదర్శి సునీల్ కుమార్ బర్న్వాల్ అన్నారు.
స్కిల్స్ స్కేప్ 2024 థీమ్స్ ఇవే..
1. ఉన్నత విద్యా సంస్థల్లో నైపుణ్యం అవసరం
2. నైపుణ్యంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర
3. హెచ్ ఈఐల్లో నైపుణ్యం కోసం పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాలు
4. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు/పట్టణాలకు చేరుకోవడం.