Zero female interaction : ‘అమ్మాయిలతో మాట్లాడటం కరువైపోయింది’- ఓ విద్యార్థి వ్యథ!
zero female interaction IIT Kanpur student : ‘అమ్మాయిలతో మాట్లాడి చాలా కాలమైంది. నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది,’ అని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థి చేసిన పోస్ట్.. ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలేం జరిగిదంటే..
IIT Kanpur student zero female interaction : సాధారణంగా.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలు- అబ్బాయిల మధ్య ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా మంది సిగ్గు, భయంతో మాట్లాడటమే మానేస్తూ ఉంటారు. ఇంకొందరు.. అమ్మాయిలతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆశించిన రిజల్ట్ ఉండదు. ఇది దాదాపు విద్యార్థులందరు అంగీకరించే విషయం. అయితే.. తనకు కూడా ఇదే పరిస్థితి ఏదురైందని, 'జీరో ఫీమేల్ ఇంటరాక్షన్' కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ విద్యార్థి బాధపడుతూ చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
'అమ్మాయిలతో మాట్లాడటమే కరువైపోయింది..'
ఐఐటీ కాన్పూర్‌కి చెందిన ఓ విద్యార్థికి ప్రముఖ సోషల్ మీడియా రెడిట్‌లో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ పేరు 'approachable_'. ఇటీవలే.. రెడిట్కి చెందిన ఐఐటీకే కమ్యూనిటీలో అతను ఓ పోస్ట్ పెట్టాడు. దీనికి అందరు రిలేట్ అవుతున్నారు.
"గత కొంతకాలంగా నన్ను ప్రభావితం చేస్తున్న విషయాన్ని బయటకు చెప్పుకోవాలని అనుకుంటున్నాను. నేను ఐఐటీకే విద్యార్థిని. నేను అమ్మాయిలతో మాట్లాడి చాలా కాలమైంది. చెప్పాలంటే.. 'జీరో ఫీమేల్ ఇంటరాక్షన్'.. నా పరిస్థితి. ఇది నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నాకు ఒక్క ఫీమేల్ ఫ్రెండ్ కూడా లేదు. ఫీమేల్ ఫ్రెండ్స్ లేకపోవడంతో.. సోషల్ ఇంటరాక్షన్‌లో ఒక భాగాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగుతుందని బాధగా ఉంది. అరేంజ్ మ్యారేజ్ అయ్యేంతవరకు.. నా పరిస్థితి ఇలాగే ఉంటుందని, మహిళలతో సహజమైన కమ్యూనికేషన్ ఉండదని అనిపిస్తోంది. ఇందులో నుంచి బయటకు వచ్చి, మంచి అర్థవంతమైన ఫ్రెండ్షిప్స్ చేసుకోవాలని నాకు ఉంది. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు," అని రెడిట్‌లో పోస్ట్ చేశాడు ఆ విద్యార్థి.
Zero female interaction : 'జీరో ఫీమేల్ ఇంటరాక్షన్' అంటూ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి చేసిన పోస్ట ఇప్పుడు వైరల్‌గా మరింది. అంతేకాకుండా.. చాలా మంది యూజర్స్, ఈ విషయంపై తమ ఆలోచనలను పంచుకుంటున్నారు.
"బ్రో.. నువ్వు పూర్తిగా నిజం చెప్పావు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అమ్మాయిలతో అస్సలు మాట్లాడలేకపోతున్నాను. చాలా సిగ్గుగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోందని నువ్వు చెప్పిన మాటల్లో నిజం ఉంది. పైగా.. మన చుట్టుపక్కన, అమ్మాయిలు- అబ్బాయిలు కలిసి ఉండటాన్ని చూసి మనం బాధపడతాము. మనం అలా ఎందుకు లేమని యాంగ్జైటీ పెరుగుతుంది. ఫీమేల్ ఫ్రెండ్స్‌ని పొందే అర్హత మనకి లేదా? అనిపిస్తుంది. కానీ.. మనం మన ఆలోచనలను పంచుకుంటే, అందరు నవ్వుతారు. "సెల్ఫ్- కంపెనీని ఎంజాయ్ చెయ్" అని సలహాలిస్తారు. నాకు అసలు పురుషుల్లో కూడా ఫ్రెండ్స్ లేరు! స్నేహం చాలా ప్రయత్నించాను. కానీ ఒక స్ట్రేంజర్‌తో మాట్లాడాలని ఎవరు అనుకోరు," అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు.
Zero female interaction Reddit : "నీకు నచ్చే, ఆసక్తి కలిగించే పనులు చెయ్యి. ఎన్జీఓ, థియేటర్, మ్యూజిక్, యోగా.. ఎందులోనైనా జాయిన్ అవ్వు. ఇలా చేస్తే.. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దానితో పాటు నీ చుట్టూ కొత్త కొత్త మనుషులు ఉంటారు. ఇంటరాక్షన్‌కి అవకాశం ఉంటుంది," అని మరో యూజర్ సలహా ఇచ్చారు.
"నా పరిస్థితి కూడా అదే. చాలా రోజుల నుంచి నా పరిస్థితి కూడా అదే బ్రో," అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
"ఇలాంటి వాటి గురించి ఆలోచించకు. ఈ ఆలోచనలు నిన్ను బాధకలిగిస్తాయి. నీ మీద నువ్వు ఫోకస్ చెయ్. మెంటల్ బ్యాలెన్స్ పొందు," అని మరో వ్యక్తి చెప్పారు.
మరి.. ఈ 'జీరో ఫీమేల్ ఇంటరాక్షన్' మీద మీరేం అంటారు.
సంబంధిత కథనం