IIT graduate laid off : 23ఏళ్లకే బడా కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన ఐఐటీ గ్రాడ్యుయేట్!
IIT graduate laid off by Goldman Sachs : ఓ 23ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే జాబ్‌ను కోల్పోయాడు! లేఆఫ్‌లో భాగంగా.. అతడిని తప్పించింది గోల్డ్‌మాన్ సాక్స్.
IIT graduate laid off by Goldman Sachs : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినపడుతున్న ప్రతికూల అంశాల్లో 'లేఆఫ్' ఒకటి. దీని తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ.. కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. కాగా.. ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్, ఓ బడా కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన ఘటన తాజాగా వార్తలకెక్కింది. 'నా పుట్టిన రోజు జరిగిన కొన్ని రోజులకే.. నా ఉద్యోగం పోయినట్టు తెలిసింది,' అంటూ ఆ ఐఐటీ గ్రాడ్యుయేట్ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే..
శుభం సాహు అనే 23ఏళ్ల వ్యక్తి.. 2022లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆరు నెలల క్రితమే బెంగళూరులోని గోల్డ్‌మాన్ సాక్స్‌లో చేరాడు. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితమే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.
Goldman Sachs layoffs 2023 : జాబ్ కట్ రూపంలో 3,200 మంది ఉద్యోగులను ఇటీవలే తొలగించింది గోల్డ్‌మాన్ సాక్స్. ఇండియాలో గోల్డ్‌మాన్ సాక్స్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 6.5శాతం! ఉద్యోగం కోల్పోయిన వారిలో శుభం సాహు కూడా ఉన్నాడు.
"వావ్.. నూతన ఏడాదిని ఈ విధంగా మొదలుపెట్టడం చాలా భిన్నంగా ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అది నా మొదటి ఉద్యోగం. నా మొదటి అనుభూతి. కానీ ఇప్పుడు నా ఉద్యోగం పోయింది. గోల్డ్‌మాన్ సాక్స్‌లో నేను పనిచేసింది తక్కువ కాలమే అయినా.. ఆ అవకాశం నాకు దక్కడం సంతోషకరం. నేను కృతజ్ఞుడిని," అని లింక్డిన్లో రాసుకొచ్చాడు శుభం సాహు. ఈ క్రమంలోనే మరో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నట్టు లింక్డిన్లో అప్డేట్ చేశాడు.
Goldman Sachs layoff India : సాహు ఒక్కడే కాదు.. గోల్డ్‌మాన్ సాక్స్‌లో ఉద్యోగం కోల్పోయిన వారిలో చాలా మంది ఇప్పుడు లింక్డిన్లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇండియాకు చెందిన షిల్పి సోని అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్.. టెక్సాస్‌లోని గోల్డ్‌మాన్ సాక్స్‌లో 1.7ఏళ్లుగా ఉద్యోగం చేస్తోంది. తాజా జాబ్ కట్స్‌లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయింది. "జీవితం చాలా వేగంగా తలకిందులైపోతుంది," అని ఆమె తన లింక్డిన్లో రాసుకొచ్చింది.
సంబంధిత కథనం