'If you can’t say it, write it': చైల్డ్ అబ్యూజ్ పై ఫ్రాన్స్ లో వినూత్న ఉద్యమం-if you can t say it write it french kids reveal abuse ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  'If You Can't Say It, Write It': French Kids Reveal Abuse

'If you can’t say it, write it': చైల్డ్ అబ్యూజ్ పై ఫ్రాన్స్ లో వినూత్న ఉద్యమం

Sudarshan Vaddanam HT Telugu
Nov 01, 2022 11:30 PM IST

Movement against child abuse in france: చిన్నారులపై వేధింపుల(child abuse)కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ లో వినూత్న ఉద్యమం ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Movement against child abuse in france: చిన్నారులపై వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. హైదరాబాద్ లో డీఏవీ స్కూల్ లో చిన్నారిపై డ్రైవర్ చేసిన అఘాయిత్యం లాంటివెన్నో వివిధ కారణాలతో వెలుగులోకి రాకుండానే పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్ని పిల్లలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Movement against child abuse in france: ‘చెప్పలేకపోతున్నారా? రాసి చూపండి’

అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించే ఫ్రాన్స్ లోనూ చిన్న పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయి. అక్కడ కూడా చాలా మంది పిల్లలు తమపై జరుగుతున్న వేధింపులను చెప్పుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీస్ అధికారి లారెంట్ బోయెట్(Police officer Laurent Boyet) వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతీ పాఠశాలలో, గ్రౌండ్ ల్లో, పార్క్ ల్లో, హౌజింగ్ కమ్యూనిటీల్లో, వీధి మలుపుల్లో తెల్ల రంగు బాక్స్ లను ఏర్పాటు చేశారు. తమపై జరిగే వేధింపులను చెప్పుకోలేకపోతున్న పిల్లలు.. ఆ విషయాలను రాసి ఈ బాక్స్ ల్లో వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందు కోసం 'If you can’t say it, write it' అనే నినాదాన్ని ప్రారంభించారు. వేధింపుల గురించి రాసిన వారి వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన పోలీస్ అధికారి కూడా చిన్నప్పుడు వేధింపలను ఎదుర్కొన్న వాడేనట.

Movement against child abuse in france: భారీ స్పందన

Les Papillons (“Butterflies”) పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఊహించనంత స్పందన లభించింది. పిల్లలు పెద్ద ఎత్తున తమపై జరుగుతున్న వేధింపులను రాసి అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్ ల్లో వేశారు. వాటిలో కొన్ని సీరియస్ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. వాటిపై పోలీసులు దృష్టి పెట్టారు. మరికొన్ని కౌన్సెలింగ్ అవసరమైనవి ఉన్నాయి. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 61 వేల మంది పిల్లలు తమపై వేధింపులను వెల్లడించారు. మొత్తంగా వాటిని విశ్లేషిస్తే.. 13% పాఠశాలలో ఏడిపించడం, 21% శారీరకంగా వేధించడం(కొట్టడం వంటివి), 7% లైంగిక వేధింపులు ఉన్నాయి. అలాగే, కుటుంబంలో వేధింపులకు సంబంధించి 30% ఉన్నాయి. తమపై వేధింపులకు సంబంధించి ఈ బాక్స్ ల్లో లేఖలు రాసిన వారిలో బాలికలే 70% ఉన్నారు. 8, 9 ఏళ్ల వయస్సు వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు 50% పైగా ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.