IDBI recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్ లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-idbi recruitment 2023 apply for 136 sco posts at idbibankin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Idbi Recruitment 2023: Apply For 136 Sco Posts At Idbibank.in

IDBI recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్ లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 02:03 PM IST

IDBI recruitment 2023: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 20. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.idbibank.in వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IDBI recruitment 2023: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers SCO ) పోస్ట్ ల భర్తీకి ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 20. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.idbibank.in వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి.

ట్రెండింగ్ వార్తలు

IDBI recruitment 2023: ఆన్ లైన్ లో దరఖాస్తు..

ఐడీబీఐ బ్యాంక్ లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers SCO ) పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.idbibank.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 20. దరఖాస్తు ఫామ్ తో పాటు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ. 1000 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ. 200 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

IDBI recruitment vacancy details: వేకెన్సీ వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 136 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers SCO ) పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. వాటిలో..

  • మేనేజర్ - 84 పోస్ట్ లు
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 46 పోస్ట్ లు
  • డెప్యూట జనరల్ మేనేజర్ - 6 పోస్ట్ లు

How to apply: అప్లై చేసుకోవడం ఎలా?

  • ఐడీబీఐ బ్యాంక్ లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (Specialist Cadre Officers SCO ) పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా www.idbibank.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే “Recruitment of Specialist Officer – 2023-24 (Phase II)” లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్ చేసుకున్న తరువాత, స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి. అనంతరం ఆ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
  • IDBI recruitment 2023 direct link to apply

WhatsApp channel