ICSI CSEET 2024: ‘కంపెనీ సెక్రటరీ’ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం-icsi cseet january 2024 registration begins at icsi edu direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Icsi Cseet January 2024: Registration Begins At Icsi.edu, Direct Link Here

ICSI CSEET 2024: ‘కంపెనీ సెక్రటరీ’ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Oct 20, 2023 02:27 PM IST

ICSI CSEET 2024: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) 2024 కంపెనీ సెక్రటరీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీఎస్ఈఈటీ 2024 పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ICSI CSEET 2024: కంపెనీ సెక్రటరీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే సీఎస్ఈఈటీ 2024 (Company Secretary Executive Entrance Test CSEET 2024) పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) ప్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

డిసెంబర్ 15 లాస్ట్ డేట్

సీఎస్ఈఈటీ జనవరి 2024 కోసం ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఐసీఎస్ఐ (ICSI) అధికారిక వెబ్ సైట్ icsi.edu ద్వారా అప్లై చేసుకోవచ్చు. సీఎస్ఈఈటీ 2024 పరీక్షకు రిజిస్టర్ చేసుకోవడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 15, 2023. ఈ పరీక్షకు హాజరు కావడానికి కనీసం ఇంటర్మీడియట్ కోర్స్ (10+2) లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

వీరు ఈ పరీక్ష రాయనక్కర లేదు..

ఈ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా ఈ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం కొంతమంది విద్యార్థులకు ఉంటుంది. సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ - ఫౌండేషన్ (CS Executive programme – Foundation) ను పూర్తి చేసినవారు సీఎస్ఈఈటీ ని రాయాల్సిన అవసరం లేదు. అలాగే, కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసినవారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు, ఐసీఎంఏఐ పూర్తి చేసినవారు ఈ సీఎస్ఈఈటీ ని రాయాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల కోసం విద్యార్థులు ICSI అధికారిక వెబ్‌సైట్‌ icsi.edu ని పరిశీలించండి.

అప్లై చేయడం ఎలా?

CSEET పరీక్ష జనవరి 6వ తేదీన జరుగుతుంది. ఈ పరీక్ష కోసం ఐసీఎస్ఐ (ICSI) అధికారిక వెబ్ సైట్ icsi.edu ద్వారా కింద వివరించిన స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  • ముందుగా ICSI అధికారిక వెబ్‌సైట్‌ icsi.edu ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే లేటెస్ట్ అప్ డేట్స్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ కనిపించే ICSI CSEET January 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్ చేసుకుని, ఆ వివరాల ద్వారా లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఒక హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.

WhatsApp channel