ICSI CS June 2023: కంపెనీ సెక్రటరీ జూన్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం-icsi cs june 2023 registration to begin tomorrow at icsiedu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Icsi Cs June 2023: కంపెనీ సెక్రటరీ జూన్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ICSI CS June 2023: కంపెనీ సెక్రటరీ జూన్ సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 08:10 PM IST

CS June 2023 session: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (Institute of Company Secretaries of India ICSI) జూన్ 2023 సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CS June 2023 session: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (Institute of Company Secretaries of India ICSI) జూన్ 2023 సెషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభిస్తోంది.

CS June 2023 session: లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు CS June 2023 session కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందుకు గానూ వారు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (Institute of Company Secretaries of India ICSI) అధికారిక వెబ్ సైట్ icsi.edu ని సందర్శించాల్సి ఉంటుంది. CS June 2023 session కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేట్ ఫీజు లేకుండా ఆఖరు తేదీ మార్చి 25. అలాగే, లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్, ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్ లకు పరీక్ష ఫీజు రూ. 1200 లు గా నిర్ణయించారు.

Know how to apply: రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

ICSI CS June 2023 సెషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా..

1) ఐసీఎస్ఐ అధికారిక వెబ్ సైట్ icsi.edu ను ఓపెన్ చేయాలి.

2) హోం పేజ్ లో కనిపించే ICSI CS June 2023 registration లింక్ పై క్లిక్ చేయాలి.

3) వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

4) అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.

5) అప్లికేషన్ ఫీ చెల్లించాలి.

6) అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

7) భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

Start date for enrolmentFeb 26, 2023
Last date of Submission of enrollment form (Without Late Fee)March 25, 2023
Last date of Submission of enrollment form (With Late Fee)April 9, 2023
Addition of Module (Without Late Fee)March 25, 2023
Addition of Module (With Late Fee)April 9, 2023
Apply Exemption on the Basis of Higher QualificationApril 9, 2023
Enrollment Services (Change of Centre /Module /Medium /Cancellation of Exemption Request(/ Re-submission of Call For Documents for granting Exemption on the Higher QualificationMay 1, 2023

Whats_app_banner

టాపిక్