ICSE results 2024 : ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
ICSE, ISC Results 2024: ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
ICSE 10th class results 2024 : సీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ). ఈ ఏడాది.. మొత్తం 2,43,617 మంది ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,42,328 మంది పాస్ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్ 12 పరీక్ష రాసిన 99,901 మంది విద్యార్థుల్లో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే.. ఐసీఎస్ఈ పాస్ పర్సెంటేజ్ 99.47శాతం. ఐఎస్సీ పాస్ పర్సెంటేజ్ 98.19శాతం.
ఐసీఎస్ఈ క్లాస్ 10 ఫలితాల్లో 99.65శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. 99.31శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాలు 2024ల 98.92శాతం మంది అమ్మాయిలు, 97.53శాతం మంది అబ్బాయిలు పాస్ అయ్యారు.
క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలను చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్సీ క్లాస్ 12 ఫలితాలను ఇలా చెక్ చేసుకండి..
స్టెప్ 1:- సీఐఎస్సీఈ - www.cisce.org అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
ISC class 12 results 2024 check online : స్టెప్ 2:- ఫలితాల పేజీకి వెళ్లి, ఐసీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 లేదా ఐఎస్సీ బోర్డు పరీక్షల ఫలితాలు 2024 పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఐసీఎస్ఈ / ఐఎస్సీగా కోర్సు కోడ్‌ను ఎంచుకోండి. గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
ISC class 12 results 2024 : స్టెప్ 4:- ఫలితాలను ఇప్పుడు స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు.
స్టెప్ 5:- ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ అవుట్ తీసుకోండి.
డిజీలాకర్‌లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- https://results.digilocker.gov.in లోకి వెళ్లండి.
స్టెప్ 2:- సీఐఎస్సీఈ సెక్షన్‌తో కూడిన డిజీలాకర్ ల్యాండిగ్ పేజ్ కనిపిస్తుంది.
స్టెప్ 3:- ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్సీ క్లాస్ 12 బటన్ మీద ప్రెస్ చేయండి.
స్టెప్ 4:- ఇండెక్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి
స్టెప్ 5:- సబ్మీట్ బటన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 6:- స్క్రీన్ మీద కనిపించే మీ ఫలితాలను చెక్ చేసుకోండి.
CISCE results 2024 : విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- ఇవాల్యుయేషన్ వెసులుబాటును కల్పిస్తుంది సీఐఎస్సీఈ. ఒక్కో సబ్జెక్ట్‌కి రీ-చెకింగ్‌కి రూ. 1000, రీ- ఇవాల్యుయేషన్కి రూ. 1,500 చెల్లించాలి.
ఐసీఎస్ఈ, ఐఎస్సీ కంపార్ట్మెంట్ పరీక్షలను డిస్కంటిన్యూ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు విద్యార్థులు, గరిష్ఠంగా రెండు సబ్జెక్ట్స్‌లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం సీఐఎస్సీఈ వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 28 వరకు, ఐఎస్సీ (12వ తరగతి) పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్ 21న నిర్వహించారు.
సంబంధిత కథనం