ICICI Bank FD rate: ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్-icici bank fd rate hikes effect from 22 june 2022 details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Icici Bank Fd Rate Hikes Effect From 22 June 2022 Details Here

ICICI Bank FD rate: ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్

HT Telugu Desk HT Telugu
Jun 22, 2022 02:06 PM IST

ICICI Bank FD rate: ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును వారం రోజుల వ్యవధిలో రెండోసారి పెంచింది.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి (ఫైల్ ఫోటో)
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి (ఫైల్ ఫోటో) (Deepak Salvi)

ICICI Bank FD rate: ప్రయివేటు రంగంలో పేరున్న బ్యాంకు ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. 185 రోజుల నుంచి 1 ఏడాది లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై, అలాగే 1 ఏడాది నుంచి 2 ఏళ్ల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది.

ట్రెండింగ్ వార్తలు

ఆరో రోజుల క్రితమే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ మరోసారి రూ. 2 కోట్ల లోపు విలువ గల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచింది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించిది. ఇవి ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎఫ్‌డీ రేట్లు 2.75 శాతం నుంచి 5.75 శాతం మధ్య ఉన్నాయి. ప్రస్తుతం 185 రోజుల నుంచి 365 రోజుల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లు, అట్లాగే ఒక ఏడాది నుంచి రెండు సంవత్సరాల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్టు తెలిపింది.

185 రోజుల నుంచి 365 రోజుల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇకపై 4.65 శాతం వడ్డీ లభిస్తుంది. ఇప్పటివరకు ఇది 4.60 శాతంగా ఉండేది. అలాగే 1 ఏడాది నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ఇప్పటివరకు 5.30 శాతం వడ్డీ రేటు ఉండగా, ఇకపై 5.35 శాతం మేర వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇక ఇతర కాలవ్యవధులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చలేదు.

కాగా 185 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితితో ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగు రకాల టెర్మ్ డిపాజిట్ ఆప్షన్లను అందిస్తోంది. 185 నుంచి 210 రోజులు, 211 నుంచి 270 రోజులు, 271 నుంచి 289 రోజులు, 290 నుంచి 365 రోజులు.. ఇలా నాలుగు కాలపరిమితులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వెసులుబాటును ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తోంది. వీటన్నింటిపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది.

ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పట్టిక

<p>ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పట్టిక</p>
ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పట్టిక
IPL_Entry_Point