ICAI CA May Exam 2023: ‘ఐసీఏఐ సీఏ’ మే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ రేపే
ICAI CA May Exam 2023: ఐసీఏఐ మే ఎగ్జామ్ (ICAI CA May Exam 2023) కి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 24
మే, జూన్ నెలల్లో జరిగే ఐసీఏఐ సీఏ (Institute of Chartered Accountants of India Chartered Accountant ICAI CA ) పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 24. ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.org. ద్వారా ఆన్ లైన్ లో విదార్థులు ఈ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు.
ICAI CA May Exam 2023: ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్
ఐసీఏఐ సీఏ (Institute of Chartered Accountants of India Chartered Accountant) కు సంబంధించిన ఫౌండేషన్ (foundation), ఇంటర్మీడియట్ (intermediate), ఫైనల్ (final) కోర్సులకు సంబంధించి మే లేదా జూన్ నెలల్లో జరిగే పరీక్షలకు (ICAI CA May Exam 2023) విద్యార్థులు లేట్ ఫీజు లేకుండా ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు (late fees) తో మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించే కరెక్షన్ విండో (correction window) మార్చి 4 నుంచి మార్చి 10 వరకు అధికారికవెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
How to apply అప్లై చేసుకోవడం ఎలా?
- ముందుగా ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ How to apply కు వెళ్లాలి.
- హోం పేజీలో ఉన్న examinations లింక్ పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో May/June exam లింక్ పై క్లిక్ చేయాలి.
- లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
- స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అనంతరం, అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా ఒకసారి చెక్ చేసుకుని, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.