ICAI CA Foundation Results: ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితాల విడుదల; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..-icai ca foundation result 2023 declared heres how to check and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Icai Ca Foundation Result 2023 Declared; Here's How To Check And More

ICAI CA Foundation Results: ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితాల విడుదల; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Aug 08, 2023 05:30 PM IST

ICAI CA Foundation Results: ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్ ను icai.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ICAI CA Foundation Results: ఐసీఏఐ సీఏ (ICAI CA) ఫౌండేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు తమ రిజల్ట్ ను icai.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్ష జూన్ నెలలో జరిగింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ల ఆధారంగా icai.nic.in వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

విదేశాల్లోని 8 సెంటర్లలో..

ఈ ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్ష జూన్ నెలలో జరిగింది. జూన్ 24, 26, 28, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా 274 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. అలాగే, విదేశాల్లోని 8 కేంద్రాల్లో కూడా ఈ పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ఫలితాల్లో మెరిట్ లిస్ట్ ను ప్రకటించబోమని ఐసీఏఐ స్పష్టం చేసింది. ఈ పరీక్షలో 70% లేదా ఆ పై మార్కులు సాధించిన విద్యార్థులను ‘పాస్ విత్ డిస్టింక్షన్ (pass with distinction)’ గా ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే ఒక్కో పేపర్ లో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే, సగటున అన్ని పేపర్లు కలిపి 50% మార్కులు రావాలి.

Steps to check results: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

  • ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే CA Foundation June 2023 results లింక్ ను క్లిక్ చేయాలి.
  • మీ వివరాలతో లాగిన్ కావాలి.
  • రిజల్ట్ పేజీ ఓపెన్ అయిన తరువాత మీ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లను ఎంటర్ చేయాలి.
  • మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ రిజల్ట్ పేజ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజ్ ను ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

WhatsApp channel