ICAI CA Foundation: సీఏ ఫౌండేషన్ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?-icai ca foundation 2023 admit card released at icaiorg ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Icai Ca Foundation 2023 Admit Card Released At Icai.org

ICAI CA Foundation: సీఏ ఫౌండేషన్ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

2023 జూన్ లో జరిగే ఐసీఏఐ సీఎ ఫౌండేషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను ఐసీఏఐ విడుదల చేసింది. వాటిని eservices.icai.org. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఫౌండేషన్ (CA Foundation) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను eservices.icai.org. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి eservices.icai.org. వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

జూన్ 24 నుంచి పరీక్షలు.

ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్షలు జూన్ 24, జూన్ 26, జూన్ 28, జూన్ 30 తేదీల్లో జరగనున్నాయి. ఈ కింది స్టెప్స్ ఫాలో అవడం ద్వారా విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ eservices.icai.org. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే “Click here To Download Admit Card For Foundation Exam June 2023” లింక్ పై క్లిక్ చేయాలి.
  • విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
  • స్క్రీన్ పై అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. ఆ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డ్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
  • Direct link to download ICAI CA Foundation admit card

టాపిక్