IAS receives blessings of older woman: తెలుగు కలెక్టర్ కు వృద్ధురాలి దీవెన-ias officer receives blessings from older woman shares a heartening post ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ias Officer Receives Blessings From Older Woman, Shares A Heartening Post

IAS receives blessings of older woman: తెలుగు కలెక్టర్ కు వృద్ధురాలి దీవెన

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 03:45 PM IST

IAS Officer receives blessings from older woman: తెలుగు వాడైన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ ప్రస్తుతం కేరళలో జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ, నిజాయితీగా వ్యవహరిస్తూ మన్ననలు పొందుతున్నారు.

IAS officer కృష్ణ తేజను దీవిస్తున మహిళ
IAS officer కృష్ణ తేజను దీవిస్తున మహిళ (Twitter/@mvrkteja)

IAS Officer receives blessings from older woman: ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ(IAS Officer Krishna Teja) ప్రస్తుతం కేరళలోని అలప్పుజ జిల్లా కలెక్టర్ గా విధుల్లో ఉన్నారు. కృష్ణ తేజ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ పై కొన్ని గంటల్లోనే వేలల్లో నెటిజన్ల స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

IAS Officer receives blessings from older woman: వృద్ధురాలి దీవెన

IAS Officer receives blessings from older woman: ఆ ట్వీట్ లో కృష్ణ తేజ ఒక వృద్ధురాలు తలపై చేయిపెట్టి తనను దీవిస్తున్న ఒక ఫొటోను షేర్ చేశారు. తన ఆఫీస్ గదిలో కుర్చీలో కూర్చుని ఉండగా, ఆ వృద్ధురాలు కృష్ణతేజ ను దీవిస్తుండగా, ఆయన వినయంగా తల వంచి ఉన్నట్లుగా ఆ ఫొటోలో ఉంది. దాంతో పాటు, ‘ఐ యామ్ ఫర్ అలెప్పీ’ హ్యాష్ ట్యాగ్ తో ‘ఇంతకన్నా ఏ కావాలి’ అనే కామెంట్ పెట్టారు. ఆ వృద్ధురాలు తనను ఎందుకు దీవించారన్న వివరాలు మాత్రం అందులో లేవు. ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే వైరల్ అయింది.

IAS Officer receives blessings from older woman: నెటిజన్ల స్పందన

దీనిపై నెటిజన్లు, ముఖ్యంగా కేరళ వాసులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ పోస్ట్ కు 30 వేల లైక్స్ వచ్చాయి. ‘మీ వినయమే మీకు సంపద’ అని ఒక నెటిజన్, ‘పెద్దల దీవెనలు రెక్కల వంటివి. మనం అనుకున్న చోటుకు ఎగిరిపోగల శక్తిని ఇస్తాయి’ అని మరో యూజర్ స్పందించారు. హార్ట్ ఇమోజీతో వేల మంది తన స్పందన తెలియజేశారు.

IAS Officer receives blessings from older woman: ఆంధ్ర ప్రదేశ్ వాడే..

ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణ తేజ(IAS Officer Krishna Teja) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వాడు. చిలకలూరి పేటలో స్కూలింగ్, నర్సరావు పేటలో ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ చదివారు. కొన్నాళ్లు ఐబీఎంలో జాబ్ చేశారు. సివిల్స్ నాలుగో ప్రయత్నంలో 66వ ర్యాంక్ తో ఐఏఎస్ సాధించారు. కేరళలో IAS Officer గా నిజాయితీతో, సమర్ధవంతంగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

IPL_Entry_Point