Kuwait building fire news : భారత్కు.. కువైట్ అగ్మిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహలు..
Kuwait fire accident : కువైట్లోని మంగఫ్ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను ఐఏఎఫ్ ప్రత్యేక విమానం స్వదేశానికి తీసుకువచ్చింది. బుధవారం అగ్నిప్రమాదం ఘటన జరిగింది.
Kuwait fire accident latest news : 45 మంది భారతీయుల మృతదేహాలతో కూడిన ప్రత్యేక ఐఏఎఫ్ విమానం.. జూన్ 14న కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి ఐఏఎఫ్ గురువారం రాత్రి సీ-130జే విమానాన్ని కువైట్కు పంపింది.

మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తీసుకొచ్చేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానంలో ఉన్నారు. అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల్లో కొందరు కొన్ని ఈశాన్య, తూర్పు భారత రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కొచ్చి నుంచి విమానం ఢిల్లీకి బయలుదేరనుంది.
కేరళ సీఎం పినరయి విజయన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి కూడా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
Kuwait fire accident death toll : అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేస్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హరియాణాకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
కేంద్ర మంత్రి సురేశ్ గోపి సైతం.. కొచ్చి విమానాశ్రయానికి వెళ్లారు.
“ఈ ఘటన ప్రభావం దేశంపై చాలా ఉంటుంది. ప్రవాస భారతీయుల సమాజంపై ఇదొక పిడుగు. ప్రవాస భారతీయుల పట్ల దేశం, రాష్ట్రానికి చాలా గౌరవం ఉేంటుంది. కుటుంబాలకు సైతం ఇది వ్యక్తగత నష్టం. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. భారత్ వేగంగా అడుగులు వేసింది. అన్నింటిని ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది,” అని సురేశ్ గోపి అన్నారు.
Kuwait fire accident dead bodies : కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ.. “ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే కేంద్ర ప్రభుత్వం, ఎంఈఏ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కువైట్లో ప్రక్రియలు వేగంగా జరిగాయి. మృతదేహాలు వెంటనే వచ్చాయి. నిన్న సాయంత్రానికి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా,” అని అన్నారు.
ఇదీ జరిగింది..
కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగిందని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని కువైట్ ప్రభుత్వ వార్తా సంస్థ (కునా) తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనం పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారు జామున మొదలైన మంటలు వేగంగా భవనం అంతటా వ్యాపించి లోపల ఉన్న పలువురిని చుట్టుముట్టి, క్షణాల్లో సజీవ దహనం చేశాయి. మృతులంతా భారతీయులేనని, వారు ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారని అధికారులు ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం