IAF Agniveervayu Recruitment : ఐఏఎఫ్​ అగ్నివీర్వాయు​ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్​​ విడుదల..-iaf agniveervayu recruitment 2024 notification out apply from july 8 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iaf Agniveervayu Recruitment : ఐఏఎఫ్​ అగ్నివీర్వాయు​ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్​​ విడుదల..

IAF Agniveervayu Recruitment : ఐఏఎఫ్​ అగ్నివీర్వాయు​ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్​​ విడుదల..

Sharath Chitturi HT Telugu
Published Jun 17, 2024 05:20 PM IST

IAF Agniveervayu Recruitment : ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ 2024
ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ 2024

IAF Agniveervayu notification 2024 : అగ్నివీర్వాయు ఇన్​టేక్ 02/2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది భారత వైమానిక దళం (ఐఏఎఫ్). అగ్నివీరులుగా ఎయిర్​ఫోర్స్​లో చేరాలనుకునే అభ్యర్థులు agnipathvayu.cdac.in ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విండో.. జూలై 8న (ఉదయం 11 గంటలకు) ప్రారంభమై జూలై 28న (రాత్రి 11 గంటలకు) ముగుస్తుంది.

ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్​మెంట్ కోసం పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నుంచి సెలెక్షన్ టెస్ట్ నిర్వహించనున్నారు.

ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ 2024:

వయోపరిమితి: అభ్యర్థి జూలై 3, 2004 నుంచి జనవరి 3, 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని). ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధిస్తే, నమోదు తేదీ నాటికి అతని / ఆమె గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండాలి.

IAF Agniveervayu syllabus : వైవాహిక స్థితి, ప్రెగ్నెన్సీ: అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు. అంతేకాకుండా అవివాహిత అగ్నివీర్వాయు మాత్రమే రెగ్యులర్ కేడర్​లో ఎయిర్ మ్యాన్​గా ఎంపికకు అర్హులు. నాలుగేళ్ల ఎంగేజ్మెంట్ పీరియడ్​లో గర్భం దాల్చకుండా ఉండేందుకు మహిళా అభ్యర్థులు అదనంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు:

(ఎ) సైన్స్ సబ్జెక్టులు

  • ఇంటర్మీడియట్ (12వ తరగతి) పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా
  • ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా కోర్సు (లేదా ఇంటర్మీడియట్/ మెట్రిక్యులేషన్ లో, డిప్లొమా కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టు కాకపోతే). లేదా
  • IAF Agniveervayu : నాన్-ఒకేషనల్ సబ్జెక్టు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో రెండేళ్ల ఒకేషనల్ కోర్సులో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి మరియు ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి (లేదా ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టు కాకపోతే ఇంటర్మీడియట్ / మెట్రిక్యులేషన్).

(బి) సైన్స్ సబ్జెక్టులు కాకుండా..

  • ఏదైనా స్ట్రీమ్/సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కనీసం 50% మార్కులతో ఇంగ్లిష్ లో
  • కనీసం 50% మార్కులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి (లేదా ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టు కాకపోతే ఇంటర్మీడియట్/మెట్రిక్యులేషన్ లో).

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

బ్యాంక్​ ఆఫ్​ బరోడా నోటిఫికేషన్​ చూశారా..?

బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజీరియల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 627 పోస్టులను భర్తీ చేయనుంది.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో జులై 2వ తేదీ వరకు దరఖాస్తులు పంపించవచ్చు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.