Virgin again : మళ్లీ 'వర్జిన్'​ అయ్యేందుకు భారీగా ఖర్చు చేస్తున్న మోడల్​- సాధ్యమేనా?-i want to be a virgin again brazilian influencer spends 16 lakh on surgery ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Virgin Again : మళ్లీ 'వర్జిన్'​ అయ్యేందుకు భారీగా ఖర్చు చేస్తున్న మోడల్​- సాధ్యమేనా?

Virgin again : మళ్లీ 'వర్జిన్'​ అయ్యేందుకు భారీగా ఖర్చు చేస్తున్న మోడల్​- సాధ్యమేనా?

Sharath Chitturi HT Telugu
Dec 06, 2024 01:43 PM IST

Virgin again : ‘నేను మళ్లీ వర్జిన్​ అవుతాను’ అంటోంది 23ఏళ్ల బ్రెజిల్​ ఇన్​ఫ్లుయెన్స్​! ఇందుకోసం భారీగా ఖర్చు చేసి వెజైనల్​ రెజువనేషన్ ఆపరేషన్​ చేయించుకునేందుకు రెడీ అవుతోంది.

మళ్లీ 'వర్జిన్'​ అయ్యేందుకు భారీగా ఖర్చు చేస్తున్న మహిళ
మళ్లీ 'వర్జిన్'​ అయ్యేందుకు భారీగా ఖర్చు చేస్తున్న మహిళ (Instagram/ravenahanniely.jobs)

బ్రెజిల్​కి చెందిన ఓ ఇన్​ఫ్లుయెన్సర్ చేసిన ఒక షాకింగ్​ ప్రకటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తాను మళ్లీ వర్జిన్​ (కన్య) అవ్వాలని కోరుకుంటున్నట్టు, దీని కోసం శస్త్ర చికిత్సకు రెడీ అవుతున్నట్టు రవేనా హన్నీలీ పేర్కొంది. ‘వెజైనల్​ రెజువనేషన్​’ ఆపరేషన్​ కోసం దాదాపు రూ. 16లక్షల వరకు ఖర్చు చేస్తోంది ఈ 23ఏళ్ల ఇన్​ఫ్లుయెన్సర్​.

yearly horoscope entry point

"ఈ ప్రక్రియ నాకు ఒక ముఖ్యమైనది. నా జీవితలో ప్రత్యేక స్థానాన్నికలిగి ఉంది. ఈ శస్త్రచికిత్స నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం, అని రవేనా హన్నీలీ చెప్పింది.

హైమెనోప్లాస్టీ అంటే ఏమిటి..?

హైమెనోప్లాస్టీ అని పిలిచే ఈ విధానాన్ని హైమెన్ రిపేర్ అని కూడా అంటారు. హైమెన్ దగ్గర చిరిగిన ఎడ్జ్​లను డిసాల్వెబుల్​ స్టిచెస్​ (కుట్లు)తో శస్త్రచికిత్స ద్వారా డాక్టర్​ కుడతారు.

"నేను మళ్లీ కన్యగా మారాలనుకుంటున్నాను," అని రవేనా హాన్నీలీ ప్రకటించింది. "ఇది నా ఆత్మగౌరవం కోసం. వ్యక్తిగత కారణాల కోసం నాకు ఎల్లప్పుడూ ముఖ్యమైనది," అని వివరించింది.

అయితే, ఈ విధానం వల్ల మానసిక ప్రయోజనాలు ఉన్నాయని, ఒక మహిళ తన కోసం ఏం కోరుకుంటుందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఈ 23ఏళ్ల బ్రెజిల్​ ఇన్​ఫ్లుయెంన్సర్​ చెప్పుకొచ్చింది.

రిస్క్ గురించి డాక్టర్ వార్నింగ్..

హైమెనోప్లాస్టీ అనేది మోడల్ ప్రచారం చేస్తున్నంత గొప్పగా ఉండదని, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియ "కాస్మెటిక్ సర్జరీ" అయినప్పటికీ, ఇది మరింత "సింబాలిక్" అని, వాస్తవానికి ఒకరి కన్యత్వాన్ని పునరుద్ధరించలేమని చెబుతున్నారు.

రోగికి ఇన్ఫెక్షన్, మచ్చలు వచ్చే అవకాశం ఉన్నందున ‘కన్యత్వాన్ని తిరిగిపొందటం’ అనే అంశం ప్రమాదకరమన్న విషయాన్ని గ్రహించాలని వైద్యులు తెలిపారు. ప్రక్రియ సమయంలో, తరువాత చిన్నపాటి రక్తస్రావం, సరిగ్గా కోలుకోలేకపోవడం వంటివి కూడా జరగొచ్చని హెచ్చరిస్తున్నారు.

"ఇది భారీ నైతిక ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. అందుకే సమాజం ఒత్తిడి చేస్తోందన్న కారణంగా ఇలాంటి పనులు చేయకూడదు. వీటిపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది సాంస్కృతిక, మానసిక కోణాలతో ముడిపడి ఉన్నందున సమాచార సమ్మతి కీలకం" అని ఓ డాక్టర్ చెప్పారు.

అయితే బ్రెజిల్ మోడల్ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది. "దురదృష్టవశాత్తు, ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆప్షన్స్​ని అర్థం చేసుకోలేరు లేదా మద్దతు ఇవ్వలేరు. మనం తీర్పు ఇవ్వడం మానేసి, ఈ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభించాలి,' అని తనని తాను వెనకేసుకొచ్చింది 23ఏళ్ల రవేనా హన్నీలీ.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.