Gender change: ‘‘ఆమె నుంచి అతను’’ గా జెండర్ మార్చుకున్న హైదరాబాద్ ఐఆర్ఎస్ అధికారి; కేంద్రం అనుమతి
Gender change: ప్రస్తుతం హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారి అధికారిక రికార్డుల్లో తన పేరును, జెండర్ ను మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనసూయ అనే తన పేరును ఎం.అనుకతిర్ సూర్యగా ఆ ఐఆర్ఎస్ అధికారి మార్చుకున్నారు.
IRS Officer changes her gendహైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ ఎస్ ) అధికారి తన అధికారిక రికార్డుల్లో పేరు, లింగమార్పిడి చేయించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది. తన పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చాలని, లింగాన్ని స్త్రీ నుంచి పురుషుడిగా మార్చాలని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం.అనసూయ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అనసూయ ఇకపై అనుకతిర్ సూర్య
అనసూయ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని ఆమోదించినట్లు మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎం.అనసూయ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఇకపై ఆ అధికారిని అన్ని అధికారిక రికార్డుల్లో 'మిస్టర్ ఎం అనుకతిర్ సూర్య'గా గుర్తిస్తామన్నారు. కాంపిటెంట్ అథారిటీ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ (ఏఆర్), సీబీఐసీ పరిధిలోని అన్ని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లు/ పీఆర్ డైరెక్టర్ జనరల్ లకు పంపుతారు.
తమిళనాడు నుంచి..
2013లో తమిళనాడులోని చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్ గా కెరీర్ ప్రారంభించిన ఐఆర్ఎస్ అధికారి అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి పొందారు. 2023 జనవరి నుంచి తెలంగాణలోని హైదరాబాద్ లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Madras) నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనుకతిర్ సూర్య భోపాల్ లోని నేషనల్ లా ఇన్ స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్ లో పీజీ డిప్లొమా చేశారు.
ఇక 'సార్' కాదు, నేను 'మేడమ్'
మరో ఉదంతంలో.. థర్డ్ జెండర్ ను అధికారికంగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. 2015లో ఓదీషా ప్రభుత్వ అధికారి ప్రధాన్ తన జెండర్ ఐడెంటిటీని థర్డ్ జెండర్ కు మార్చుకున్నారు. 2015లో సుప్రీంకోర్టు ఆ చారిత్రాత్మక తీర్పు వెలువరించిన రోజే పురుష లింగానికి బదులు థర్డ్ జెండర్ ఐడెంటిటీని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నానని ప్రధాన్ చెప్పారు.
చాలా మంది ఆశ్చర్యపోయారు
ఈ మార్పు పలువురిని విస్మయానికి గురిచేసిందని ప్రధాన్ అన్నారు. ‘కానీ అంతా నార్మల్ అయిపోయింది. నన్ను 'సార్' అని సంబోధించిన వారే ఇప్పుడు నన్ను 'మేడమ్' అని సంబోధిస్తున్నారు. నా పై అధికారి చాలా సపోర్ట్ చేయడంతో నాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాలేదు’ అని వివరించారు. తన పేరును ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ గా మార్చాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ సమర్పించానని తెలిపారు.
టాపిక్