How to Play YouTube videos in background : యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేయడం ఎలా?-how to play youtube videos in the background in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How To Play Youtube Videos In The Background In Telugu

How to Play YouTube videos in background : యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేయడం ఎలా?

Sharath Chitturi HT Telugu
Aug 30, 2022 08:01 AM IST

How to Play YouTube Videos in Background : యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేసేందుకు ఒక ట్రిక్​ ఉంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేయడం ఎలా?
యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేయడం ఎలా? (AP)

How to Play YouTube Videos in Background : పాటలు వినాలన్నా, ఫన్నీ వీడియోలు చూడాలన్నా, వివిధ అంశాల గురించి తెలుసుకోవాలన్నా.. వన్​స్టాప్​ సొల్యూషన్​ 'యూట్యూబ్​'! ఈ సామాజిక మాధ్యమం ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. అయితే.. మొబైల్​ ఫోన్​లో ఈ యూట్యూబ్​లో వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేయడం కుదరదు. ప్రతిసారి యాప్​ను ఓపెన్​ చేసే ఉంచాలి. యూజర్లకు ఇది కాస్త చిరాకును తెచ్చిపెట్టే విషయమే. 'బ్యాక్​గ్రౌండ్​లో యూట్యూబ్​ వీడియోలను ప్లే చేసే ఆప్షన్​ ఉంటే ఎంత బాగుంటుందో'.. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే.. యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేసేందుకు ఓ 'ట్రిక్​' ఉంది. అది తెలుసుకుంటే.. ఇక చిరాకు ఉండదు. ప్రశాంతంగా పని జరిగిపోతుంది.

ఆండ్రాయిడ్​ ఫోన్​లో ఉండే ఆ ట్రిక్​ ఏంటంటే..

  • YouTube tricks : స్టెప్​ 1:- గూగుల్​ క్రోమ్​ ఓపెన్​ చేయండి. అక్కడ పైన తీ డాట్స్​ కనిపిస్తాయి. దాని మీద క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 2:- డ్రాప్​ డౌన్​ మెన్యూ కనిపిస్తుంది. అందులో డెస్క్​టాప్​ మోడ్​ను క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 3:- ఇప్పుడు గూగుల్​ సెర్చ్​లో Youtube.com ని ఓపెన్​ చేయండి.
  • స్టెప్​ 4:- మీకు కావాల్సిన వీడియోను సెర్చ్​ చేసి క్లిక్​ చేయండి. ఆ తర్వాత స్క్రీన్​ను ఎగ్జిట్​ అయిపోండి.
  • స్టెప్​ 5:- నోటిఫికేషన్​ ప్యానెల్​ ఓపెన్​ చేయండి. అక్కడ మీడియా కంట్రోల్స్​ కనిపస్తాయి. మీ వీడియో పాజ్​ అయినట్టు ఉంటుంది. ప్లే బటన్​ క్లిక్​ చేయండి. మీ యూట్యూబ్​ వీడియో బ్యాక్​గ్రౌండ్​లో ప్లే అవుతుంది.

ఈ విధంగా.. యూట్యూబ్​ వీడియోలను బ్యాక్​గ్రౌండ్​లో ప్లే చేసుకోండి.

యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి?

How to add subtitles to YouTube videos : ఇప్పుడు చాలా మంది.. యూట్యూబ్​లో వీడియోలు చూడటం సహా సొంతంగా ఛానెల్​ పెట్టి కంటెంట్​ తయారు చేస్తున్నారు. 'ఈ జనరేషన్​లో.. భాషతో సంబంధం లేదు, కంటెంట్​ బాగుంటే చాలు.. ఛానెల్​ సూపర్​ హిట్​ అవుతుంద'ని అనడంలో సందేహం లేదు. భాష ఏదైనా.. 'సబ్​టైటిల్స్​/క్యాప్షన్లు' ఉంటే చాలు.. కంటెంట్​ను వ్యూవర్స్​ సులభంగా అర్థం చేసుకోగలుగుతుండటం విశేషం. మరి.. మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా? మీరు కూడా మీ యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలని అనుకుంటున్నారా? మీకు ఆ ప్రక్రియ తెలియదా? అయితే ఈ కథనం మీకోసమే..!

యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేసేందుకు ప్రస్తుతం నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముందే రాసిన ఫైల్​ని అప్లోడ్​ చేసుకోవచ్చు. ఆటో సింక్​ ఆప్షన్​ కూడా ఉంటుంది. సొంతంగా టైప్​ చేసుకోవచ్చు. ఆటో ట్రాన్స్​లేట్​ కూడా చేసుకోవచ్చు.

యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్