Whatsapp tricks : వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్​ చేశారా? ఇలా తెలుసుకోండి!-how to know if someone has blocked you on whatsapp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How To Know If Someone Has Blocked You On Whatsapp

Whatsapp tricks : వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్​ చేశారా? ఇలా తెలుసుకోండి!

Sharath Chitturi HT Telugu
Sep 18, 2022 06:32 PM IST

How to know if someone has blocked you on WhatsApp : మిమ్మల్ని వాట్సాప్​లో ఎవరైనా బ్లాక్​ చేశారా? ఆ సందేహం వస్తే ఈ కథనం మీకోసమే.

వాట్సాప్​లో ఎవరైనా బ్లాక్​ చేశారా? ఇలా తెలుసుకోండి!
వాట్సాప్​లో ఎవరైనా బ్లాక్​ చేశారా? ఇలా తెలుసుకోండి! (WhatsApp)

How to know if someone has blocked you on WhatsApp : ఇతర వ్యక్తితో మాట్లాడటం ఇష్టం లేకపోత వాట్సాప్​లో వారిని బ్లాక్​ చేయడం సర్వ సాధారణమైన విషయం. అయితే.. ఒక్కోసారి మనల్ని బ్లాక్​ చేశారా? అన్న సందేహాలు వేధిస్తూ ఉంటాయి. అయితే.. వాట్సాప్​లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్​ చేశారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే..

ట్రెండింగ్ వార్తలు

1. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్​ చేస్తే.. వారి కాంటాక్ట్​ లాస్ట్​ సీన్​, ఆన్​లైన్​ స్టేటస్​లు, మీకు కనిపించవు. ఇది ఒక ఇండికేషన్​ ఇస్తుంది. అంతేకానీ మిమ్మల్ని బ్లాక్​ చేసినట్టు కాదు.

2. ఒక్కోసారి ప్రొపైల్​ పిక్స్​ కూడా కనిపించవు. అదే జరిగితే.. మిమ్మల్ని వాట్సాప్​లో బ్లాక్​ చేసే అవకాశాలు ఎక్కువ అని అర్థం చేసుకోవాలి.

3. మెసేజ్​ చేస్తే.. ఒక టిక్​ మాత్రమే వస్తుంది. రెండో టిక్​ రాదు. సాధారణంగా.. మెసేజ్​ డెలివరీ అయితేనే రెండో టిక్​ వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్​ చేస్తే.. మీ మెసేజ్​లు డెలివరీ అవ్వవు. ఫలితంగా ఒకటే టిక్​ కనిపిస్తుంది.

4. ఇక వీడియో, వాయిస్​ కాల్స్​ చేసినప్పుడు.. అవి పనిచేయకోపోతే.. మిమ్మల్ని వాట్సాప్​లో బ్లాక్​ చేసినట్టు అనుకోవచ్చు.

ఇవన్నీ కలిసి కనిపిస్తే.. సంబంధిత వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్​ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇందులో వేరే పాజిబులిటీస్​ కూడా ఉంటాయని తెలుసుకోవాలి.

వాట్సాప్​లో కాంటాక్ట్​ను బ్లాక్​ చేయడం ఎలా?

  • స్టెప్​ 1:- వాట్సాప్​ ఓపెన్​ చేసి.. తీ డాట్స్​ ఆప్షన్​లోకి వెళ్లి సెట్టింగ్స్​లోకి వెళ్లండి.
  • స్టెప్​ 2:- యాడ్​ ఆప్షన్​ను క్లిక్​ చేయండి.
  • స్టెప్​ 3:- మీరు ఏ కాంటాక్ట్​ని అయితే బ్లాక్​ చేద్దాం అనుకుంటున్నారో దానిని సెర్చ్​ చేయాల్సి ఉంటుంది. దానిని బ్లాక్​ చేసుకోవచ్చు.

Whatsapp tricks : అయితే.. వాట్సాప్​లో కాంటాక్ట్​ను బ్లాక్​ చేయడం కోసం ఇతర మార్గం కూడా ఉంది.

  • స్టెప్​ 1:- కాంటాక్ట్​ చాట్​లోకి వెళ్లండి.
  • స్టెప్​ 2:- కాంటాక్ట్​ ఇన్ఫో ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 3:- కిందకి స్క్రోల్​ చేస్తే బ్లాక్​ ఆప్షన్​ కనిపిస్తుంది.

Whatsapp new features : మీరు బ్లాక్​ చేసిన తర్వాత.. సంబంధిత కాంటాక్ట్​ నుంచి మీరు ఎలాంటి మెసేజ్​లు, వీడియో కాల్స్​, ఫోన్​ కాల్స్​ పొందలేరు.

వాట్సాప్​లో కాంటాక్ట్​ని అన్​బ్లాక్​ చేయడం ఎలా?

  • స్టెప్​ 1:- వాట్సాప్​ ఓపెన్​ చేసి త్రీ డాట్స్​ సింబల్​ మీద క్లిక్​ చేసి, సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • స్టెప్​ 2:- అకౌంట్​.. ప్రైవసీ.. బ్లాకడ్​ కాంటాక్ట్స్​ని క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 3:- మీకు కావాల్సిన కాంటాక్ట్​ మీద క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 4:- దానిని అన్​బ్లాక్​ చేయాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం