క్రెడిట్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబర్ మార్చడం ఎలా?-how to change credit card address mobile number email id ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How To Change Credit Card Address Mobile Number Email Id

క్రెడిట్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబర్ మార్చడం ఎలా?

HT Telugu Desk HT Telugu
May 27, 2022 11:53 AM IST

క్రెడిట్ కార్డుపై మొబైల్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడీ ఛేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పబోయే పద్ధతులు ఉపయోగిస్తే సులువుగా ఛేంజ్ చేయొచ్చు.

క్రెడిట్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబరు వివరాలను అప్‌డేట్ చేసుకోవడం వల్ల సమాచార గోప్యత ఉంటుంది.
క్రెడిట్ కార్డులో అడ్రస్, మొబైల్ నెంబరు వివరాలను అప్‌డేట్ చేసుకోవడం వల్ల సమాచార గోప్యత ఉంటుంది. (REUTERS)

అనేక కారణాల వల్ల మనం ఇల్లు మారొచ్చు. లేదా ఫోన్ నెంబరే మార్చాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం క్రెడిట్ కార్డుపై మన వివరాలన్నీ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవడం మంచిది. సంబంధిత స్టేట్‌మెంట్లు వేరే వాళ్ల చేతిలో పడకుండా చూసుకోవడం మేలు చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

చాలాసార్లు మనం ఇది గమనిస్తూనే ఉంటాం. మన సిమ్ కార్డుకు వేరెవరిదో క్రెడిట్ కార్డుకు సంబంధించిన, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారం వస్తుంటుంది. లేదా మన అడ్రస్‌కు వేరెవెరిదో (అంతకు ముందు ఆ చిరునామాలో అద్దెకు ఉన్నవారిది) క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వస్తుంది. అందుకని మనం ఇల్లు మారినప్పుడు, ఫోన్ నెంబరు మార్చినప్పుడు క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయడం మరిచిపోవద్దు.

ఇలా అప్‌డేట్ చేయండి..

క్రెడిట్ కార్డు‌తో లింకై ఉన్న మొబైల్ నెంబరును, అడ్రస్‌ను, ఈమెయిల్ ఐడీని ఈ కింది పద్ధతుల్లో మార్చండి. 

ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నెంబర్ ఛేంజ్ చేయడం ఇలా.. 

బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి. అక్కడ మై ప్రొఫెల్ సెక్షన్‌లో కాంటాక్ట్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెక్షన్‌లో మీరు మొబైల్ నెంబరు అ‌ప్డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ నెంబరు సబ్మిట్ చేయగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. ఈ మెయిల్ ఐడీ కూడా ఇదే పద్దతిలో మార్చుకోవచ్చు. 

అడ్రస్ మార్పు ఇలా..

మై ప్రొఫైల్ సెక్షన్‌లోనే సర్వీసెస్ అనే ట్యాబ్ లేదా ఆప్షన్ ఉంటుంది. ఇది నొక్కగానే కొత్త పేజీకి తీసుకెళ్లుతుంది. అక్కడ మీరు మీ కొత్త చిరునామాను నింపాల్సి ఉంటుంది. 

అడ్రస్ నింపిన తరువాత అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్‌గా ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మొబైల్ బిల్లు, గ్యాస్ బిల్లులలో ఏదో ఒకటి అప్‌లోడ్ చేయొచ్చు.

 అనంతరం ఓటీపీ నెంబర్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. బ్యాంక్ మీ అభ్యర్థనను రెండు మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తుంది.

మొబైల్ యాప్ ద్వారా ఇలా..

కాంటాక్ట్ డీటైల్స్, అడ్రస్ డీటైల్స్ సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థల మొబైల్ యాప్స్‌లో కూడా మార్చుకోవచ్చు. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ మార్చుకోవాలంటే మై ప్రొఫైల్ సెక్షన్ వెళ్లి ఎడిట్ ఆప్షన్ నొక్కి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ మార్చాలి. మీ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసేయొచ్చు. ఇదే రీతిలో అడ్రస్ కూడా అప్ ‌డేట్ చేసి అడ్రస్ ప్రూఫ్ అప్ ‌లోడ్ చేయాలి. 

కస్టమర్ కేర్ ద్వారా గానీ, సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థ స్థానిక కార్యాలయంలో గానీ మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

IPL_Entry_Point