Senior Citizen Savings Scheme: వృద్ధులకు 7.4% వడ్డీ ఇచ్చే అద్భుత పథకం ఇది..-how senior citizens can get over rs 2 lakh annual income through scss ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Senior Citizen Savings Scheme: వృద్ధులకు 7.4% వడ్డీ ఇచ్చే అద్భుత పథకం ఇది..

Senior Citizen Savings Scheme: వృద్ధులకు 7.4% వడ్డీ ఇచ్చే అద్భుత పథకం ఇది..

HT Telugu Desk HT Telugu

Senior Citizen Savings Scheme: పెరిగిపోతున్న నిత్యావసర ఖర్చులు, తప్పించుకోలేని కుటుంబ వ్యయాలు, అకస్మాత్తుగా ముంచుకువచ్చే మెడికల్ అవసరాలు, తగ్గిన ఆదాయం.. సీనియర్ సిటిజన్లను భయపెట్టేవి ఇవే. అయితే, ఆ అవసరాలను తీర్చగల సేవింగ్స్ స్కీమ్ అందుబాటులో ఉంటే.. ఆ ధైర్యమే వేరు కదా..

ప్రతీకాత్మక చిత్రం (Mint)

Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్లకు అన్ని సేవింగ్స్ పై అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కన్నా కనీసం అరశాతం వడ్డీ రేటును ఎక్కువగా ఇస్తుంటాయి. అయినా, అది అరకొర గానే ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే.. అవి ఇచ్చే వడ్డీ రేటు ఏ మూలకు చాలదు.

Senior Citizen Savings Scheme: ఈ పథకం బెస్ట్

The Senior Citizen Savings Scheme (SCSS).. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్.. ఇది అత్యధికంగా 7.4% వార్షిక వడ్డీ రేటును ఇస్తుంది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ SBI సహా అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా ఇది ఎక్కువ. అలాగే, ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు అయిన 7% కన్నా కూడా ఎక్కువే.

Senior Citizen Savings Scheme: రిస్క్ లేదు

సీనియర్ సిటిజన్లు సాధారణంగా రిస్క్ లేని పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తారు. జీవిత కాలం కష్టపడి సంపాదించిన డబ్బును వృద్ధాప్యంలో రిస్క్ ఉన్న పెట్టుబడులపై పెట్టడం సరికాదనే ఆలోచనతో ఉంటారు. సాధారణంగా సమ్మకమైన పెట్టుబడి సాధనంగా వారు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లను భావిస్తారు. ఈ Senior Citizen Savings Scheme (SCSS) కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఒకటి. ఇది సీనియర్ సిటిజన్లు కోరుకునే గవర్న్మెంట్ బ్యాక్డ్, రిస్క్ ఫ్రీ, పోస్ట్ ఆఫీస్ స్కీం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు.

Senior Citizen Savings Scheme: ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఎలా?

స్కీం పేరులో ఉన్నట్లు.. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. 60 ఏళ్లు పైబడిన ఎవరైనా రూ. 1000 నుంచి రూ. 15 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఏదైనా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఈ SCSS అకౌంట్ ను ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర సాధారణ ఫిక్సడ్ డిపాజిట్ల మాదిరి గానే ఈ పథకానికి కూడా లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. అలాగే, ఈ పథకం ద్వారా వచ్చే ఆదాయం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద, పన్ను పరిధిలోకి రాదు.

Senior Citizen Savings Scheme: ఆదాయం ఎలా?

ఒక ఉదాహరణ ద్వారా ఈ పథకంలో ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం. ప్రస్తుత వడ్డీ రేటునే ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తే.. ఒక సీనియర్ సిటిజన్ రూ. 15 లక్షలను ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, ఆ సీనియర్ సిటిజన్ ప్రతీ మూడు నెలలకు రూ. 27750 రూపాయల వడ్డీ ఆదాయం పొందుతారు. అంటే, సంవత్సరానికి రూ. 1,11,000 వడ్డీ పొందుతారు. అంటే, ఐదేళ్ల మెచ్యురిటీ పీరియడ్ ముగిసిన తరువాత, ఆ వ్యక్తి రూ. 5,55,000ల మెచ్యూరిటీ అమౌంట్ ను పొందుతారు. అలాగే, డిపాజిట్ చేసిన రోజు ఏ వడ్డీ రేటు ఉందో, మెచ్యూరిటీ పీరియడ్ ముగిసే ఐదేళ్ల వరకు అదే వడ్డీ రేటు లాక్ అయి ఉంటుంది. అ పథకంలో జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. అంటే, భార్యభర్తలిద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే, గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా చేస్తే వారికి, వార్షికంగా రూ. 2,22,000 వడ్డీ ఆదాయం లభిస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.