Train names in India : భారతీయ రైళ్లకు వాటి పేర్లు ఎలా వస్తాయో తెలుసా?-how do indian railways trains get their names read full theory here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  How Do Indian Railways Trains Get Their Names Read Full Theory Here

Train names in India : భారతీయ రైళ్లకు వాటి పేర్లు ఎలా వస్తాయో తెలుసా?

Sharath Chitturi HT Telugu
Feb 17, 2023 08:13 AM IST

Train names in India : శతాబ్ది, దురంతో, రాజధాని.. ఈ రైళ్లకు వాటి పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? ఇక్క తెలుసుకోండి.

భారతీయ రైళ్లకు వాటి పేర్లు ఎలా వస్తాయో తెలుసా?
భారతీయ రైళ్లకు వాటి పేర్లు ఎలా వస్తాయో తెలుసా? (Mint)

Train names in India : దేశంలో భారతీయ రైల్వేది కీలక పాత్ర. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు.. రవాణా కోసం రైళ్లను ఉపయోగిస్తారు. దేశంలో ఇప్పటికీ ఇదే అతి చౌకన రవాణా మార్గం అవడంతో.. ప్రజలు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఇండియాలో ఉంది. అయితే.. అనేక రైళ్లకు వాటి గమ్యస్థానాల పేర్లు ఉంటాయి. కానీ శతాబ్ది, రాజధాని, దురంతో వంటికి మాత్రం పేర్లు చాలా భిన్నంగా ఉంటాయి. మరి వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న థియరీని ఓసారి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

శతాబ్ది.. రాజధాని.. దురంతో..

శతాబ్ది ఎక్స్​ప్రెస్​:- ఇదొక ఛైర్​ కార్​ ట్రైన్​. భారత దేశ తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా.. 1989లో దీనిని ప్రారంభించారు. అందుకే దీనికి శతాబ్ది ఎక్స్​ప్రెస్​ అన్న పేరు వచ్చింది. శతాబ్ది అంటే 100. 800 కి.మీల రేంజ్​లో ఇది నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు.

Rajdhani express timings : రాజధాని ఎక్స్​ప్రెస్​:- దేశంలో ఉన్న టాప్​ ట్రైన్స్​లో ఇదొకటి. ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల రాజధానులకు ఇది ప్రయాణిస్తుంది. హిందీ- తెలుగులో రాజధాని అంటే.. ఒకటే అర్థం వస్తుంది. అది క్యాపిటల్​ సిటీ. అందుకే ఈ రైలుకు రాజధాని ఎక్స్​ప్రెస్​ అని పేరు పెట్టారు. దీని గరిష్ఠ వేగం గంటకు 140 కి.మీలు. ఇదొక ఏసీ ట్రైన్​. భోజనం వసతులు కూడా ఉన్నాయి.

దురంతో ఎక్స్​ప్రెస్​:- బెంగాళీలో దురంతో అంటే 'నిరంతరాయం'. పేరుకు తగ్గట్టుగానే ఈ దురంతో ఎక్స్​ప్రెస్​ ప్రయాణం ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణంలో.. చాలా తక్కువ స్టేషన్స్​లోనే ఇది అగుతుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 140 కి.మీలు.

ప్రారంభం- ముగింపు..

Shatabdi express timings : వీటితో పాటు అనేక రైళ్లకు వాటి ప్రారంభ- ముంగిపు స్టేషన్స్​, క్లాస్​ డెసిగ్నేషన్​ పేర్లు ఉంటాయి. బెంగళూరు- చెన్నై మెయిల్​, పూర్ణ- హైదరాబాద్​ ప్యాసింజర్​, చెన్నై- జైపూర్​ ఎక్స్​ప్రెస్​, హౌరా- ముంబై మెయిల్​ వంటివి కొన్ని ఉదాహరణలు.

అలర్ట్…. కాచిగూడ - మెదక్ మధ్య రైళ్లు రద్దు

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలుమార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. మరమ్మత్తు పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆయా వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్